Influencer Selfie Death| సముద్రంలో యాచ్ పార్టీ చేసుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో ఆ బోటులో ఉన్నవారంతా నీటమునిగారు. అయితే సహాయక సిబ్బంది వారిని కాపాడిబయటికి తీసింది. కానీ వారందరిలో ఇద్దరు యువతులు చనిపోయారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో బాగా చర్చలు సాగుతున్నాయి. కారణం చనిపోయిన ఇద్దరు యువతులు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. అయితే వారిద్దరూ చనిపోయిన కారణం కూడా వింతగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. అలైన్ తమారా మోరేరా డి అమోరిమ్ (37). బీట్రిజ్ టవరెస్ డ సిల్వ ఫరియా (27) ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు. వారిద్దరూ సోషల్ మీడియాలో హాట్ లుక్స్‌తో ఫొటో షూట్స్ చేయడం, బికినీలలో అందాలు ఆరబోస్తూ కనిపించడం వారి వృత్తి. అయితే ఇటీవల ఇద్దరూ బ్రెజిల్ దేశంలోని సాఓ పోలో తీరంలోని డెవిల్స్ థ్రోట్ వద్ద పార్టీ చేసుకునేందుకు ఒక చిన్న స్పీడ్ బోట్ లో వెళ్లారు. అయితే ఆ బోటులో చాలా చిన్నది అందులో అయిదుగురు కంటే ఎక్కువ మంది వెళ్లడానికి లేదు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..
బోట్లో ముందుగానే కెప్టెన్ ఉండగా.. మరో నలుగురికి మాత్రమే అందులో చోటు ఉంది. కానీ పార్టీ చేసుకునేందుకు తమారా, బీట్రిజ్ తో సహా మరో ముగ్గురు వచ్చారు. వారికి బోట్ కెప్టెన్ ముందే హెచ్చరించాడు. సావో పోలో తీరంలో భారీగా రాకాసి అలలు వస్తాయని.. బోట్ లో లిమిట్ (4) కంటే ఎక్కువమందిని తీసుకెళితే ప్రమాదమని చెప్పాడు. కానీ ఒకరితో ఏమవుతుందని వారు కెప్టెన్ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు.
అయితే సముద్రంలోకి వెళ్లాక ఇద్దరు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు బికినీలు ధరించి, మేకప్ వేసుకున్నారు. ఇదంతా ఫొటోలు, వీడియోలు తీసేందుకు వారు సిద్ధమయ్యారు. బోటు.. డెవిల్స్ థ్రోట్ పాయింట్ కు చేరే సమీపంలో కెప్టెన్ వారిని లైఫ్ జాకెట్లు ధరించాలని సూచించాడు. కానీ ఇద్దరూ కూడా అందుకు అంగీకరించలేదు. లైఫ్ జాకెట్లు ధరిస్తే.. సెల్ఫీలు, ఫొటోల్లో తాము అందంగా కనిపించమని వారు చెప్పారు. అందుకే లైఫ్ జాకెట్లు వేసుకోలేదు. మిగతా ఇద్దరు లైప్ జాకెట్ వేసుకున్నారు.
కానీ విధి వారి సెల్ఫీల కోసం ఆగలేదు. డెవిల్స్ థ్రోట్ పాయింట్ వద్ద ప్రమాదకర అలలు వచ్చీరాగానే బోటుని బలంగా ఢీకొట్టాయి. ఆ సమయంలో బీట్రిజ్, తమారా వారి స్నేహితులు గ్లాసు వైన్ పోసుకొని పార్టీ చేసుకుంటున్నారు. భారీ అలలు బోట్ ని ముంచేశాయి. బోట్ కెప్టెన్ ఎలాగోలా రేడియోతో కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించాడు. కెప్టెన్ ప్రాణాలకు తెగించి లైఫ్ జాకెట్ వేసుకున్న ఇద్దరినీ కాపాడగలిగాడు. మిగతా ఇద్దరు బీట్రిజ్, తమారా నీటిలో మునిగిపోయారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది.
Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?
ఇద్దరు ఫేమస్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు చనిపోయిన ఘటనలో పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తమారా, బీట్రిజ్ మరణించడంలో బోట్ కెప్టెన్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ చేశామని.. కానీ ఇద్దరూ లైఫ్ జాకెట్ వేసుకోకపోవడం వలనే సముద్రంలో మునిగిపోయినట్లు విచారణలో తేలిందని తెలిపారు.
“కేవలం సెల్ఫీలు అందంగా రావాలని ఇద్దరూ లైఫ్ జాకెట్ ధరించలేదు. వారు సముద్రంలో బోట్ పై కూర్చొన టానింగ్ చేసుకోవాలని భావించారు. అందుకే ఈ ఘటన జరిగింది.” అని పోలీస్ కమిషన్ చెప్పారు. బీట్రిజ్, తమారా మృతదేహాలు సముద్రంలో నుంచి అక్టోబర్ 4న వెలికితీశారు. సోషల్ మీడియాలో తమారా చనిపోయే ముందు బోట్ లో నిలబడి ఉన్న తన ఫొటోని షేర్ చేసింది. సాఓ విన్సెంట్ ప్రాంతంలో సముద్రంలో ఉన్న డెవిల్స్ థ్రోట్ పాయింట్ అందాలను చూడడానికి చాలా పర్యాటకులు వెళుతూ ఉంటారు. కానీ అక్కడ ప్రతి ఏడాది ప్రమాదాలు చాలా మంది చనిపోతూ ఉండడం గమనార్హం. అందుకే దాన్ని ‘డెవిల్స్ థ్రోట్’ అని అంటారు.