Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. మార్కెట్లో లభించే ఈ క్యాప్సూల్స్‌ను చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు. వీటిని తరుచుగా వాడటం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా వివిధ చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడే విటమిన్-ఇ క్యాప్సూల్స్ నుండి కొన్ని ఫేస్ మాస్క్‌లను తయారు చేయవచ్చు.
యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన విటమిన్ ఈ చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మాన్ని తేమగా మార్చడానికి, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, విటమిన్ ఇ మాత్రలను చర్మ సంరక్షణలో విస్తృతంగా ఉపయోగిస్తారు. (విటమిన్-ఇ టాబ్లెట్లతో ఇంట్లోనే ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకుని వాడటం ద్వారా మీ చర్మాన్ని సులభంగా మెరిసేలా చేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ తో ఫేస్ మాస్క్ లు ఎలా తయారు చేసుకోవాలో వాటి ప్రయోజనాలు ఏంటీ అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి విటమిన్-ఇ యొక్క ప్రయోజనాలు:
మాయిశ్చరైజేషన్- విటమిన్ ఇ చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
యాంటీఆక్సిడెంట్- ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
మచ్చలను తగ్గిస్తుంది- విటమిన్ ఇ చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది .
మంటను తగ్గిస్తుంది – ఇది చర్మం మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది – విటమిన్ ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మెరసేలా చేస్తుంది.
విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ తో ఫేస్ మాస్క్‌లు ఎలా తయారు చేయాలంటే?
1. విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ , అలోవెరాతో ఫేస్ మాస్క్:
కావలసినవి:
ఇ క్యాప్సూల్ -1
అలోవెరా జెల్- 2 టీస్పూన్
తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌నుంచి జెల్ తీసి, అలోవెరా జెల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
చల్లటి నీటితో కడగాలి.
2. విటమిన్ E క్యాప్స్యూల్స్, తేనెతో ఫేస్ మాస్క్:
కావలసినవి:
విటమిన్ ఇ క్యాప్సూల్- 1
తేనె-1 టీస్పూన్
తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
గోరువెచ్చని నీటితో కడగాలి.
3. విటమిన్ E, పెరుగుతో ఫేస్ మాస్క్:
కావలసినవి:
విటమిన్ ఇ క్యాప్సూల్ – 1
పెరుగు- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: విటమిన్-ఇ క్యాప్సూల్‌ని పగలగొట్టి పెరుగులో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత
చల్లటి నీటితో కడగాలి.
Also Read: శనగపిండిలో ఇవి కలిపి రాస్తే.. ఎవ్వరైనా తెల్లగా అవ్వాల్సిందే !
విటమిన్ ఇ ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేయాలి ?
ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.
ఫేస్ మాస్క్‌ను ముఖంపై పలుచగా అప్లై చేయాలి.
కళ్ళు , పెదవుల చుట్టూ ఉన్న ప్రాంతాలపై అప్లై చేయడం మానుకోండి.
15-20 నిమిషాలు వదిలివేయండి.
చల్లటి నీటితో కడగండి.
ఈ ఫేస్ మాస్క్ ను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.