EPAPER

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా పృథ్వి ఫెయిల్.. గంగవ్వపై భారీ ఎఫెక్ట్, సపోర్ట్ కోల్పోయిన యష్మీ టీమ్

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా పృథ్వి ఫెయిల్.. గంగవ్వపై భారీ ఎఫెక్ట్, సపోర్ట్ కోల్పోయిన యష్మీ టీమ్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బీబీ ఇంటికి దారేది టాస్క్ ఆడడం కోసం హౌస్‌మేట్స్ అంతా రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ టీమ్స్‌గా విడిపోయారు. ప్రతీ టాస్క్ ముగిసిన తర్వాత గెలిచిన టీమ్‌కు ఒక యెల్లో కార్డ్ లభిస్తుంది. వారు ఆ యెల్లో కార్డ్‌ను తమకు నచ్చని టీమ్‌కు ఇవ్వొచ్చు. అలా రెండు యెల్లో కార్డ్స్ లభించిన టీమ్‌లోని ఒక కంటెస్టెంట్ మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ కోల్పోతాడు. ఇందులో మూడు టాస్కులు పూర్తయ్యే సమయానికి ఒక యెల్లో కార్డ్ రెడ్ టీమ్‌కు, ఒక యెల్లో కార్డ్ గ్రీన్ టీమ్‌కు, ఒక యెల్లో కార్డ్ బ్లూ టీమ్‌కు లభించింది. అప్పుడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. నాలుగో టాస్క్ గెలిచిన వారికి ఏకంగా రెండు యెల్లో కార్డ్స్ లభిస్తాయని అన్నాడు.


మరో రౌండ్

బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌లో నాలుగో టాస్క్.. పాయిజన్ యాపిల్ మొదలయ్యింది. అందులో గార్డెన్ ఏరియాలో ఒక చెట్టు ఏర్పాటు చేసుంటుంది. దానిపై రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ కలర్స్‌లో యాపిల్స్ ఏర్పాటు చేసుంటాయి. ప్రతీ టీమ్ నుండి ఒక సభ్యుడు వచ్చి చెట్టుపై ఉన్న యాపిల్స్‌ను కాపాడుకోవాలి. బజర్ మోగిన ప్రతీసారి ఇతర కంటెస్టెంట్స్ వచ్చి యాపిల్స్‌ను తెంపడానికి ప్రయత్నించాలి. ఈ టాస్క్‌కు పృథ్వి సంచాలకుడిగా వ్యవహరించాడు. టాస్క్ పూర్తయ్యే సమాయానికి పృథ్వికి సంబంధించిన యెల్లో టీమ్ ఓడిపోయింది. తను చూసినదాని ప్రకారం ఇతర మూడు టీమ్స్ మధ్య టై అయ్యిందని చెప్పాడు. దీంతో ఆ మూడు టీమ్స్ మరో రౌండ్ ఆడాలని బిగ్ బాస్ ఆదేశించారు.


Also Read: హరితేజ పై నెగిటివ్ మార్క్.. బయటకొస్తే పాప పరిస్థితి ఏంటో..?

వారే షాకయ్యారు

రెండో రౌండ్‌లో ముందుగానే బ్లూ, గ్రీన్ టీమ్స్‌కు సంబంధించిన యాపిల్స్‌ను తెంపేశారు. ఆ క్రమంలో రెడ్ టీమ్‌కు సంబంధించిన యాపిల్ కిందపడింది. అది ఎవరూ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో యష్మీనే దానిని తీసుకొని కాపాడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వచ్చి సంచాలకుడికి చెప్పింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ టీమ్ విన్ అవ్వాల్సింది. కానీ అలా జరగలేదు. యష్మీ.. తన టీమ్ యాపిల్‌ను తీసుకొని దాచిపెట్టుకున్నా కూడా తన టీమే విన్నర్ అని ప్రకటించాడు పృథ్వి. దీంతో ప్రేరణ, యష్మీ, గౌతమ్ కూడా షాకయ్యారు. అది ఫెయిర్ కాదని, వారే షాక్ అవుతున్నారని అవినాష్ కామెడీ చేశాడు. అందరూ ఊహించినట్టుగానే తమకు దక్కిన రెండు యెల్లో కార్డ్స్‌ను బ్లూ టీమ్‌కు ఇచ్చింది యష్మీ టీమ్.

ఎవరూ పట్టించుకోలేదు

బ్లూ టీమ్‌కు రెండు కార్డ్స్ రావడంతో వారి టీమ్ నుండి ఒకరిని మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పించాలి. హరితేజ, అవినాష్, నిఖిల్.. ఈ ముగ్గురు రేసు నుండి తప్పుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో గంగవ్వను మెగా చీఫ్ అవ్వకుండా తొలగించారు. అలా ఈ ముగ్గురు సేఫ్ అయ్యారు. ఇక రెడ్ టీమ్ గెలిచినా కూడా అసలు వారికి డైస్ రోల్ చేసిన తర్వాత ఏ నెంబర్లు వచ్చాయి, ఎవరు ముందుకు వచ్చారు చూడడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే సంచాలకుడిగా పృథ్వి ఫెయిల్ అవ్వడం వల్లే రెడ్ టీమ్ గెలిచిందని అందరూ భావించారు.

Related News

BB Telugu 8 Promo: కిడ్స్ గా మారిపోయిన కంటెస్టెంట్స్.. సూపర్ పర్ఫామెన్స్..!

Bigg Boss 8 Telugu: గౌతమ్, నిఖిల్ మధ్య నలిగిపోతున్న యష్మీ.. టీమ్స్‌లో విభేదాలు, చిన్న మాటలకే మనస్పర్థలు

BB Telugu 8 Hariteja : హరితేజ పై నెగిటివ్ మార్క్.. బయటకొస్తే పాప పరిస్థితి ఏంటో..?

Bigg Boss Telugu 8 Promo: స్లీపింగ్ రేస్ ఛాలెంజ్.. ఏడ్చేసిన నయని పావని..

Bigg Boss 8 Telugu: గంగవ్వ సంచాలకురాలు ఏంటి బాసు.? టాస్కుల్లో కన్‌ఫ్యూజన్, అవకాశాన్ని వాడుకున్న హరితేజ

Bigg Boss 8 Telugu: సొంత టీమ్‌కు విష్ణుప్రియా వెన్నుపోటు.. పృథ్వి చెప్పిందే జరిగిందిగా!

×