Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో రెండు టీమ్స్ కాకుండా ఒకటే టీమ్ అవ్వడం కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ‘బీబీ ఇంటికి దారేది’ అంటూ మొదలయిన ఆటలో పాల్గొనడం కోసం ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్స్‌గా విడిపోయారు. కొన్ని టీమ్స్ కలిసి ఆడడం వల్ల కొందరికి లాభం చేకూరుతుంది. విడిగానే ఆడతాము అని పట్టుబట్టిన టీమ్స్ ఓడిపోక తప్పడం లేదు. ముఖ్యంగా ఈ టాస్కుల్లో యష్మీ, నిఖిల్ టీమ్స్ హైలెట్ అవుతున్నాయి. ఒక్క గేమ్ వల్ల వీరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ పూర్తిగా పోయింది. అంతే కాకుండా నిఖిల్.. కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఒక నిర్ణయానికి వచ్చాడు.
హగ్ వద్దు
ముందుగా బీబీ ఇంటికి దారేదిలో పానిపట్టు యుద్ధం అనే టాస్క్ జరిగింది. ఇందులో యష్మీ టీమ్‌ను టార్గెట్ చేశారు నిఖిల్. తను వచ్చి ప్రేరణ, యష్మీలను పక్కకు తోసేశాడు. అది యష్మీతో పాటు ఇతర కంటెస్టెంట్స్‌కు కూడా నచ్చలేదు. అదే విషయాన్ని నిఖిల్‌తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలని అనుకుంది యష్మీ. కానీ తను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గౌతమ్ మీద ఉన్న కోపం వల్లే అలా చేశానని, అదంతా టాస్క్ అని చెప్పాలనుకున్నాడు. అయినా యష్మీ వినకుండా అరవడంతో నిఖిల్ సైతం హర్ట్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మీ హగ్ చేసుకోవడానికి వచ్చినా దూరం తోసేశాడు. ఇప్పటినుండి హౌస్‌లో ఒంటరిగానే ఆడతాననే నిర్ణయానికి వచ్చాడు. దీంతో యష్మీ కూడా ఏడ్చింది.
Also Read: హరితేజ పై నెగిటివ్ మార్క్.. బయటకొస్తే పాప పరిస్థితి ఏంటో..?
రివెంజ్ తీర్చుకున్నారు
పానిపట్టు యుద్ధంలో గ్రీన్ టీమ్ అంటే నబీల్ టీమ్ గెలిచింది. దీంతో వారు తమకు దక్కిన యెల్లో కార్డ్‌ను నిఖిల్ టీమ్‌కు ఇచ్చారు. డైస్ రోల్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఒకసారి 1, ఒకసారి 3 నెంబర్లు పడ్డాయి. టీమ్ లీడర్‌గా తాను 3వ నెంబర్ తీసుకొని 1వ నెంబర్‌ను టేస్టీ తేజకు ఇచ్చాడు నబీల్. ఆ తర్వాత బీబీ ఇంటికి దారేదిలో మ్యాట్రెస్ టాస్క్ మొదలయ్యింది. మునుపటి గేమ్‌లో ఓడిపోయామనే కసిలో ఉన్న నిఖిల్.. ఈ టాస్క్‌ను వేగంగా ఆడి గెలిచాడు. యెల్లో కార్డ్‌ను రివెంజ్‌గా గ్రీన్ టీమ్‌కే ఇచ్చారు. అందులో నయని పావని, పృథ్వి పాల్గొన్నారు. అయితే నయని పావని తన టీమే అయినా తన ఆట సరిగా లేదని రోహిణి పాయింట్ ఔట్ చేసింది. దీంతో టీమ్‌లో విభేదాలు మొదలయ్యాయి.
ఊరికే ఏడుపు
నయని పావని కరెక్ట్‌గా ఆడలేదని ముందుగా స్టేట్‌మెంట్ ఇచ్చింది రోహిణి. అది విన్న నయని.. పృథ్వితో వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆపై.. తాను కరెక్ట్‌గా ఆడలేదని రోహిణి ఫీల్ అవుతున్నట్టు అందరి ముందు అరిచి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. తన సొంత టీమ్ సభ్యులే ఇలా మాట్లాడుతుంటే ఎలా అని ఏడవడం మొదలుపెట్టింది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది. అది రోహిణికి నచ్చలేదు. హరితేజ, పృథ్వి వెళ్లి ఓదార్చేవరకు నయని రాదని, ప్రతీదానికి ఫీల్ అయిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడింది. ప్రతీ చిన్న విషయానికి నయని ఏడుపు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అదే అనిపిస్తోంది.