Silver Pooja Items: పండగ వచ్చిందంటే చాలు మహిళలు ఇంట్లో క్లీనింగ్ ప్రారంభిస్తారు. ముఖ్యంగా పండగల సమయంలో పూజా సామాగ్రిని శుభ్రం చేస్తూ ఉంటారు. పూజా సామాగ్రిలోని వెండి పాత్రలను శుభ్రం చేయడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి.సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇత్తడి, వెండి పూజా సామాగ్రి నల్లగా మారతాయి. దీంతో చూడటానికి కూడా అంత బాగుండవు.
అందుకే ఎప్పటికప్పుడు వెంటి సామాగ్రిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఒక్కో సారి సమయం లేక చాలా మంది శుభ్రం చేయకుండా వదిలేస్తుంటారు. అలాంటి సమయంలో సామాగ్రి పూర్తిగా నలుపు రంగులోకి మారతాయి.ఇలా రంగు మారిన పూజా సామాగ్రిని కొన్ని రకాల టిప్స్‌తో తెల్లగా మార్చవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేయడానికి చిట్కాలు..
బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్: ఒక పాత్రలో చిన్న కప్పు నిండా వేడి నీటిని తీసుకోండి.అందులో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పాత్రలో వెండి పాత్రలను ఉంచి, పైన అల్యూమినియం ఫాయిల్‌తో కప్పండి. కొంత సమయం తరువాత, పాత్రలను తీసి శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత మృదువైన గుడ్డతో పొడిగా తుడవండి. ఇలా చేయడం వల్ల వెండి పాత్రలు మెరుస్తాయి.
టూత్‌పేస్ట్: మెత్తని బ్రష్‌పై కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకొని వెండి వస్తువులను సున్నితంగా స్క్రబ్ చేయండి. కొంత సమయం తరువాత, శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత పొడిగా ఉన్న గుడ్డతో తుడవండి.
నిమ్మకాయ, ఉప్పు: ఉప్పులో సగం నిమ్మకాయను ముంచి, దాంతో వెండి పాత్రలను స్క్రబ్ చేయండి. కొంత సమయం తరువాత, నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత పొడిగా ఉన్న గుడ్డతో తుడవండి.
వెనిగర్: ఒక కప్పు వెనిగర్‌లో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో మెత్తని గుడ్డను ముంచి వెండి పాత్రలను తుడవండి. కొంత సమయం తరువాత, శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత పొడిగా ఉన్న గుడ్డతో తుడవండి. ఈ టిప్స్ వాడి వెండి పాత్రలను వాష్ చేయడం వల్ల జిడ్డు తొలగిపోయి మెరుస్తూ కనిపిస్తున్నాయి. వీటితో ఈజీగా వెండి పాత్రలను తెల్లగా మర్చవచ్చు.
Also Read: తరుచూ వ్యాధుల బారిన పడుతున్నారా ? ఇలా చేస్తే రోగాలు రమ్మన్నా.. రావు
ప్రత్యేక సిల్వర్ క్లీనింగ్ ఉత్పత్తులు: మార్కెట్లో అనేక రకాల సిల్వర్ క్లీనింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తులను ఉపయోగించే ముందు సూచనలను జాగ్రత్తగా చదవండి.
కొన్ని అదనపు చిట్కాలు:
వెండి పాత్రలను ఎప్పుడూ పొడి గుడ్డతో తుడిచి ఉంచాలి.
తేమ ఉన్న ప్రదేశంలో వెండి పాత్రలను పెట్టకూడదు.
వెండి పాత్రలను రసాయనాలకు దూరంగా ఉంచండి.
వెండి పాత్రలను కడిగిన వెంటనే పొడిగా ఉన్న క్లాత్‌తో తుడవండి .
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.