OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయి. హాలీవుడ్ మూవీస్ కు నిర్మాతలు బడ్జెట్ కూడా ఎక్కువగానే పెడతారు. కలెక్షన్స్ కూడా అలాగే వస్తాయి. థియేటర్లలో మంచి మార్కులు కొట్టేసిన ఒక బో*ల్డ్ రొమాంటిక్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “క్యాష్ బ్యాక్“(Cash back). ఒక కుర్రాడికి సూపర్ నేచురల్ పవర్ వస్తే, ఆ పవర్ తో కాలాన్ని ఫ్రిజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పిల్లాడు ఆ పవర్ ని ఎందుకు ఉపయోగిస్తాడో తెలిస్తే మతి పోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బెన్ అనే కుర్రాడికి ఆమె గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తుంది. ఈ బ్రేకప్ బెన్ ని కలచివేస్తుంది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఏదైనా జాబ్ లో చేరాలని ప్రయత్నిస్తాడు. ఒక సూపర్ మార్కెట్లో నైట్ డ్యూటీ జాబ్ లో జాయిన్ అవుతాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఎలా అంటే ఇతడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళింట్లో అందరూ బట్టలు లేకుండానే ఎక్కువగా తిరిగేటోళ్లు. అలా ఇతను ఆడవాళ్ళ బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాడు. అయితే సూపర్ మార్కెట్లో ఒకసారి ఈ ప్రపంచమంతా ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకోగా, ఎక్కడి వాళ్ళు అక్కడ కదలకుండా ఆగిపోతారు. ఆ కుర్రాడు అమ్మాయిల బట్టలు తీసి బొమ్మలు వేసి మళ్లీ వాళ్లకు బట్టలు తొడిగేస్తుంటాడు. ఇలా అతని దినచర్య సాగుతూ ఉంటుంది.
ఒకసారి సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి బెన్ నీ ఇష్టపడుతుంది. ఆమెది కూడా నైట్ డ్యూటి కావడంతో ఒకరినొకరు ఇష్టపడుతూ డేటింగ్ కి ప్లాన్ చేసుకుంటారు. ఆరోజు రాత్రి సూపర్ మార్కెట్ ఓనర్ ఒక పార్టీ ఇస్తుండగా అక్కడికి మాజీ ప్రియురాలు కూడా వస్తుంది. బెన్ ని చూసి నేను నిన్ను మిస్ చేసుకున్నాను అంటూ బాధపడుతుంది. అతనికి ముద్దులు కూడా పెడుతుంది. ఈ దృశ్యం చూసిన సూపర్ మార్కెట్ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సూపర్ నేచురల్ పవర్ బెన్ కి కాకుండా మరొక వ్యక్తికి కూడా ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు? బెన్ ఈ పవర్ తో తను అనుకున్నవి సాధిస్తాడా? చివరగా తన ప్రియురాలి ప్రేమని పొందగలుగుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “క్యాష్ బ్యాక్” (Cash back) మూవీని తప్పకుండా చూడండి.