IPL 2025 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 )టోర్నమెంటుకు సంబంధించిన మెగా వేలం త్వరలోనే జరగనుంది. అయితే ఐపీఎల్ రిటెన్షన్ ( IPL 2025 Retention ) ప్రక్రియ మాత్రం అక్టోబర్ 31వ తేదీన అంటే సరిగ్గా దీపావళి రోజున ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన.. పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును.. ఐపీఎల్ యాజమాన్యానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు… 10 ఫ్రాంచైజీలు ఈ లిస్టును అప్పగించాలి.
Also Read: Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?
ఇక ఆ తర్వాత.. ఆ లిస్టును ఐపీఎల్ యాజమాన్యం ప్రకటిస్తుంది. దీంతో పది ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్ ను తీసుకున్నాయి… ఈ ప్లేయర్ ను వదిలేసాయి అనేది తేలిపోతుంది. అలాగే వేలంలోకి వచ్చేవారు ఎవరు అనేదాని పైన కూడా క్లారిటీ వస్తుంది. అయితే…. IPL 2025 రిటెన్షన్ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చును. ఇందులో క్యాప్డ్ ప్లేయర్ 1కు రూ. 18 కోట్లు, క్యాప్డ్ ప్లేయర్ 2కు రూ. 14 కోట్లు, క్యాప్డ్ ప్లేయర్ 3కు రూ. 11 కోట్లు, క్యాప్డ్ ప్లేయర్ 4కు రూ. 8 కోట్లు, అన్క్యాప్డ్ ఆటగాళ్లను రూ.4 కోట్లకు అట్టిపెట్టుకోవచ్చు. ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకోకపోతే… మెగా-వేలంలోకి వదిలేయాలి.
Also Read: ICC Rankings: నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహీ, పంత్ ఔట్..!
ప్రత్యక్ష ప్రసార వివరాలు
అక్టోబర్ 31న IPL 2025 రిటెన్షన్ ప్రక్రియకు సంబంధించిన ఈవెంట్ ను స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్18 ఛానెల్‌లలో చూడవచ్చును. సాయంత్రం 5 గంటల లోపు నుంచి IPL 2025 రిటెన్షన్ ప్రారంభమవుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ JioCinema యాప్ లో కూడా చూడవచ్చును.