EPAPER

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

Vettaiyan The Hunter: వెట్టయాన్.. మనసిలాయో వీడియో సాంగ్ వచ్చేసింది..

Vettaiyan The Hunter: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం వెట్టయాన్. టీజ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్  ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, అభిరామి, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ లాంటి స్టార్స్ అందరూ నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ అయ్యి  మిక్స్డ్ టాక్ ను అందుకుంది.


సినిమా విషయం పక్కన పెడితే.. ఈ సినిమా నుంచి రిలీజైన మనసిలాయో సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్  సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించగా..నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ అద్భుతంగా ఆలపించారు. తెలుగు, తమిళ్  అనే తేడా లేకుండా అందరూ ఈ సాంగ్ కు రీల్స్ చేసి వైరల్ గా మార్చారు. మంజు వారియర్ మాస్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ సైతం ఫిదా అయ్యారు.

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..


ఇక తాజగా ఈ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు. వీడియో సాంగ్ లో మంజు డ్యాన్స్ తో అదరగొట్టింది. రజినీ స్టైల్ నెక్స్ట్ లెవెల్.. ఇక మధ్యలో అనిరుధ్  ఎంట్రీ అదిరిపోయింది. త్వరలోనే ఈ సినిమా   ఓటీటీ బాట  పట్టనుంది.  ఇక ఈ సినిమా   డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్.. ఈ సినిమాను నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో రజినీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించాడు. థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో  చూడాలి.

Related News

Yvs Chowdary : మెయిన్ ట్రాక్ లో రావడానికి నందమూరి ఫ్యామిలీని ఉపయోగించుకుంటున్నారా.?

Bagheera Twitter Review : ‘భగీరా’ ట్విట్టర్ రివ్యూ.. సైకో కిల్లర్ గా ప్రభుదేవా..?

Amaran Twitter Review : ‘అమరన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Lucky Baskhar Movie Review : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ

Ka Movie Review : ‘క’ మూవీ రివ్యూ

Nayanthara: నయన్ రీల్ కూతురును చూశారా.. ఎంత అందంగా మారిందో..

×