EPAPER

OTT Movie : ఊరంతా కల్లోలం సృష్టించే మర్డర్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఊరంతా కల్లోలం సృష్టించే మర్డర్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ మూవీలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠతో మూవీ చూస్తారు మూవీ లవర్స్. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు “అంచక్కల్ల కొక్కన్” (Anchakkalla kokkan). ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్  అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఆ హత్యను ఆ హత్యను పోలీసులు ఛేదించే క్రమంలో స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తో నడిచి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

చాప్రా అనే వ్యక్తి ఒక గ్రామంలో పెద్దమనిషిగా ఉంటాడు. ఎలక్షన్లు దగ్గరకు వస్తూ ఉండటంతో అతని మిత్రులతో డ్రింక్ చేస్తూ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అతని దగ్గర పద్మిని అనే మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఆరోజు రాత్రి చాప్రా  హత్యకు గురి అవుతాడు. పోలీసులువీరందరినీ విచారిస్తారు. విచారణలో మాకు ఏమీ తెలియదని పందుల వేటకు వచ్చిన వారు ఎవరో హత్య చేసి ఉంటారని సమాధానం ఇస్తారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన వాసుదేవన్ అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు.  చాప్రా హత్య కేసు వివరాలను తెలుసుకోవడానికి నందా అనే కానిస్టేబుల్ తో కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ వాసుదేవన్ ను కూడా తీసుకొని విచారణ చేయమని చెప్తాడు ఇన్స్పెక్టర్. చాప్రా చావుకు కారణమైన వాళ్లను చంపడానికి చాప్రా కొడుకులు ఎదురుచూస్తూ ఉంటారు.

నిజానికి చాప్రా ఇంట్లో పనిచేస్తున్న పద్మిని భర్తని చాప్రానే చంపి ఉంటాడు. ఆమె అందానికి మైమరచి భర్త ఉంటే ఆమె తనకు దక్కదని అతనిని చంపి ఉంటాడు చాప్రా. అయితే ఇది రాజకీయ హత్య లేదా మరి ఎవరైనా చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారిస్తుంటారు. ఆ గ్రామంలోనే సారా కాసే వ్యక్తి ఒకడు ఇదివరకే చాలా హత్యలు చేసి ఉంటాడు. అయితే అతడే చాప్రా ని చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తారు. మరోవైపు పద్మిని నంద అనే పోలీస్ తో సన్నిహితం గా ఉంటుంది. చివరికి రాజకీయ కోణంలోనే చాప్రాని చంపారా? పద్మినికి తన భర్తను చంపింది ఎవరో తెలుస్తుందా? వాసుదేవన్ ఈ కేసును ఛేదిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ “అంచక్కల్ల కొక్కన్” ని తప్పకుండా చూడండి. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ట్విస్టులు చాలానే ఉంటాయి. ఓటిటి లవర్స్ ఈ మూవీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఎందుకు ఆలస్యం ఈ థ్రిల్లర్ మూవీ పై ఓ లుక్కెయ్యండి.

Related News

OTT Movie: వణుకు పుట్టించే సీన్స్ తో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే అంతే.. జాగ్రత్త..

OTT Movie : అడిగిన కోరికలు తీర్చే దెయ్యాలు… తల్లిదండ్రులు చనిపోయిన అమ్మాయికే ఈ స్పెషల్ ఆఫర్

OTT Movie : స్టార్ కావాలని అలాంటి పనులు… ఈ బో*ల్డ్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ప్రపంచాన్ని కదలకుండా ఆపగలిగే శక్తి ఉంటే ఇలాంటి పనులు చేస్తారా?

OTT Bold Movie : అమ్మాయిలు కదా అని ఆశ్రయం ఇస్తే ఇంత దారుణమా? బాబోయ్ అనిపించే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అద్దాల మేడలో అందమైన అమ్మాయిలు… అక్కడ కాలు పెడితే తిరిగిరారు

×