క్యారెక్టర్ ఆర్టిస్ట్ చుంకీ పాండే కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది అనన్య పాండే. తను 1998 అక్టోబర్ 30న జన్మించింది.

అనన్య పాండే హీరోయిన్‌గా అడుగుపెట్టిన మొదట్లోనే తనపై చాలా నెగిటివిటీ వచ్చింది. కానీ అవేమీ పట్టించుకోకుండా తను ముందుకెళ్లింది.

26 ఏళ్లలోనే అనన్య పాండే.. ఎన్నో కోట్ల ఆస్తికి వారసురాలు అయ్యింది. తన ఆస్తుల వివరాలపై ఓ లుక్కేయండి.

2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో హీరోయిన్‌గా పరిచయమయిన అనన్య.. ఈ అయిదేళ్లలో ఎంతో ఫేమ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంది.

2023లో దీపావళి సమయంలోనే ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది అనన్య. అంతే కాకుండా తన దగ్గర భారీ కార్ కలెక్షన్ కూడా ఉంది.

అనన్య వద్ద రూ.1.70 కోట్ల విలువ చేసే బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, రూ.1.84 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ఉన్నాయి.

లక్షల్లో ధరలు ఉన్న మెర్సిడీజ్, స్కోడా, హ్యుండాయ్ కూడా అనన్య పాండే కార్ కలెక్షన్స్‌లో ఉన్నాయి.

ప్రస్తుతం అనన్య పాండే ఆస్తుల విలువ రూ.74 కోట్లు అని తెలుస్తోంది. తను ప్రతీ నెల రూ.60 లక్షలు, ఏడాదికి రూ.7 కోట్లు సంపాదిస్తుందని సమాచారం.

అనన్య పాండేకు ఒక్క సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని, ఒక్క బ్రాండ్ పోస్ట్ రూ.50 లక్షలు ఛార్జ్ చేస్తుందని తెలుస్తోంది.

అనన్య ప్రస్తుతం స్కెచర్స్, స్వారోవ్స్కీ, పూమా, లాక్మీ, ఫాస్ట్రాక్ పర్ఫ్యూమ్, మెబీలీన్, జేబీఎల్, గార్నియర్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది.