Jai Hanuman First Look: ప్రశాంత్ వర్మ.. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అ! అనే సినిమాతో డైరెక్టర్ గా తెలుగుతెరకు పరిచయమైన ఈ కుర్ర డైరెక్టర్.. పరాజయాన్ని చవిచూడకుండా వరుస విజయాలను అందుకుంటూ వచ్చాడు. ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. మొదటి సూపర్ హీరో సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంతోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొదలయ్యింది.
హనుమాన్ తరువాత PVCU లో వరుస సినిమాలను ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. అందులో ఒకటి జై హనుమాన్. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది. హనుమాన్ క్లైమాక్స్ లో హనుమంతుడు.. రాముడికి మాట ఇస్తున్నట్లు చూపించి ఎండ్ చేశారు. జై హనుమాన్ లో హనుమంతుడు .. రాముడికి ఇచ్చిన మాట ఏంటి.. ? ఆ మాటను నిలబెట్టుకున్నాడా.. ? అనే కథాంశంతో తెరకెక్కుతుందని, హనుమాన్ ను మించి జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
Jai HanuMan Producers : RKD – ప్రశాంత్ వర్మ టీం అప్… అందుకే నిరంజన్ అవుట్.. మైత్రీ ఇన్..?
ఇక దీంతో జై హనుమాన్ లో ఒక స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కొన్నిరోజులుగా కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నట్లు టాక్ నడిచింది. ఇక ఆ టాక్ ను నిజం చేస్తూ నేడు హనుమంతుడిగా రిషబ్ ను పరిచయం చేశారు. త్రేతాయుగం నుండి ఒక ప్రతిజ్ఞ, కలియుగంలో నెరవేరుతుంది అంటూ హనుమంతుడి రూపంలో ఉన్న రిషబ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు.
PVCU నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ప్రశాంత్.. హనుమంతుడిని ఏరేంజ్ లో చూపిస్తారో.. పోస్టర్ తోనే పిచ్చెక్కిస్తాడని అనుకున్నారు. కానీ, ప్రశాంత్ మాత్రం చాలా సింపుల్ గా పోస్టర్ ను డిజైన్ చేశాడు. రాముడి విగ్రహాన్ని హత్తుకొని హనుమంతుడు కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ కొంతవరకు నిరాశ పడినట్లు తెలుస్తోంది. ఇక రిషబ్.. ఈ పాత్రకు బెస్ట్ ఛాయిసా.. కాదా.. ? అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాంతార సినిమాలో రిషబ్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెల్సిన విషయమే.
Rajamouli: సింహానికి మహేష్ పేరు పెట్టావ్ చూడు.. అరాచకం అంతే
నటన పరంగా రిషబ్ ను కొట్టేవారు లేరు. కానీ, బాడీ పరంగా నెటిజన్స్ కొద్దిగా పెదవి విరుస్తున్నారు. రానా దగ్గుబాటి అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకొస్తున్నారు. రిషబ్ కూడా బానే ఉన్నాడని, కాకపోతే ఇంకా పర్ఫెక్ట్ అయితే బావుండేది అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొంతమంది రిషబ్.. హనుమంతుడిలా కనిపించడం లేదని, పరుశురాముడుగా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా హనుమంతుడిగా రిషబ్ నటన ఎలా ఉండనుందో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
✨ वचनपालनं धर्मस्य मूलम्। ✨
A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga 🙏
National Award-winning actor @shetty_rishab and Sensational Director @PrasanthVarma bring forth an epic of loyalty, courage and devotion❤️🔥
A @MythriOfficial’s proud presentation in… pic.twitter.com/qwfPIve1EF
— Prasanth Varma Cinematic Universe (@ThePVCU) October 30, 2024