Shani Guru Vakri 2024: దీపావళి పండుగను 31 అక్టోబర్ 2024 గురువారం జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సు, కీర్తిని పొందేందుకు ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. గ్రహాలు, రాశుల ప్రకారం ఈసారి దీపావళి ప్రత్యేకం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రోజు కుంభరాశిలో శని తిరోగమనంలో ఉంటాడు. అంతే కాకుండా దేవగురువు బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించనున్నాడు.
దీపావళి పండగ రోజు 500 ఏళ్ల తర్వాత కర్మను ప్రసాదించే శని కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రోజు దేవతల గురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన దిశలో సంచరించనున్నాడు. ఈ రెండు గ్రహాల సంచార ప్రభావం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ దీపావళి చాలా మంచిది. బృహస్పతి, శని గ్రహాల తిరోగమనం ప్రభావం వల్ల ఈ వ్యక్తుల జీవితాల్లో సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త వాహనం, కొత్త కారు లేదా కొత్త ఇల్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. భాగస్వామ్యంతో లాభాలు పొందుతారు.మకర రాశి వారికి శని, గురు గ్రహాల తిరోగమనం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు ఆకస్మిక ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశం ఉంది. మీరు సమాజంలో గౌరవం పొందుతారు. ఇది కాకుండా, ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి బృహస్పతి, శని సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. అంతే కాకుండా బృహస్పతి మీ రాశి యొక్క 10వ ఇంట్లో , శని ఏడవ ఇంట్లో తిరోగమన దిశలో సంచరించనున్నారు. అందువల్ల ఈ సమయంలో మీ వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. అంతే కాకుండా ఉద్యోగం కోసం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహితుల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అవివాహితులను వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ పరంగా కూడా ఇది మంచి సమయం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
Also Read: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి
వృశ్చిక రాశి: బృహస్పతి , శని తిరోగమన కదలిక మీకు అనుకూలంగా ఉంటుంది. శని మీ నాల్గవ ఇంటిలో బృహస్పతి ఏడవ ఇంటిలో సంచరించనున్నాడు. అందువల్ల మీ భౌతిక ఆనందం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్లొంటారు. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీ భాగస్వామి నుంచి ప్రయోజనాలు పొందుతారు. సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)