ICC Rankings: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఈ మధ్యకాలంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన న్యూజిలాండ్… సిరీస్ కైవసం చేసుకుంది. మరొక టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో… ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ICC) కీలక ప్రకటన చేసింది. టెస్ట్ ర్యాంకింగ్స్ ను ( Test Rankings) తాజాగా రిలీజ్ చేసింది ఐసీసీ పాలకమండలి ( ICC ). అయితే తాజాగా ఐసీసీ ప్రకటించిన… టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కు ఎదురు దెబ్బ తగిలింది.
టీమిండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేయర్ల అందరి ర్యాంకులు పడిపోయాయి. మొదటి స్థానంలో ఉన్న బుమ్రా ( Bumrah )… తన ఫస్ట్ ర్యాంకు కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు బుమ్రా. అదే సమయంలో కసిగో రబాడా ( Kagiso Rabada ) మొదటి స్థానానికి చేరుకోవడం జరిగింది. అలాగే జోష్ హాజిల్‌వుడ్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. మూడో స్థానంలో బుమ్రా ( Bumrah ).. నాలుగో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?
వాస్తవంగా ఇటీవల బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కసిగో రబాడా ( Kagiso Rabada ) ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక భూమిక పోషించడం జరిగింది. దీంతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు కసిగో రబాడా ( Kagiso Rabada ). బౌలర్ల విషయం ఇలా ఉంచితే… బ్యాటర్ల విషయంలో కూడా టీమిండియా కు ఎదురుదెబ్బే తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ ( Virat kohli ), రిషబ్ పంత్ ( Rishabh Pant) ఈ ఇద్దరు ప్లేయర్లు… టాప్ 10 జాబితా నుంచి వైదొలి గారు. అంటే విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు కోల్పోయి… 14వ స్థానానికి చేరుకోవడం జరిగింది.
Also Read: Gujarat Titans: షమీకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ కు 18 కోట్లు?
ఇక రిషబ్ పంత్.. ఐదు స్థానాలు కోల్పోయి 11వ నెంబర్ కు చేరుకున్నాడు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడు లేని విధంగా అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. న్యూజిలాండ్ జట్టుతో ఆడిన రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. దీంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కూడా రోహిత్ శర్మ కిందికి దిగజారిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 24వ స్థానానికి పడిపోయాడు రోహిత్ శర్మ. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇంతటి తక్కువ స్థాయికి పడిపోవడం మొదటిసారి. 2018 డిసెంబర్ సమయంలో.. రోహిత్ శర్మ 24వ స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు అదే పరిస్థితిని రోహిత్ శర్మ ఎదుర్కోవడం జరిగింది. అటు యశస్వి జైస్వాల్ మాత్రం.. 790 పాయింట్లు తో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.
ICC టెస్ట్ ర్యాంకింగ్స్
బ్యాటింగ్ ర్యాంకింగ్స్
బౌలింగ్ ర్యాంకింగ్స్
ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్