చిత్రం – లక్కీ భాస్కర్
విడుదల తేదీ – 31 అక్టోబర్ 2024
నటీనటులు – దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడేకర్, హైపర్ ఆదితో పాటు తదితరులు
దర్శకులు – వెంకీ అట్లూరి
నిర్మాతలు – సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
Lucky Baskhar Movie Review and Rating – 2.5/5
ఈ దీపావళికి ఎవరు విన్నర్ అవుతారనేది చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. అన్ని సినిమాల కంటే నాగ వంశీ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ మూవీకే విన్నర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే టాక్ వస్తుంది. ఆ టాక్ నిజమవుతుందా… దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో హిట్టు కొట్టబోతున్నాడా… అని తెలుసుకునే రోజు రానే వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ ఈ రోజు థియేటర్ లోకి వచ్చింది. మరి ఈ మూవీ మిగతా మూడు సినిమాలను వెనక్కి నెట్టి దీపావళి విన్నర్ గా నిలిచిందా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం….
కథ :
భాస్కర్ (దుల్కర్ సల్మాన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మగధ అనే బ్యాంకులో సాధారణ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పని చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆ బ్యాంక్‌లో సిబిఐ రైడ్ జరుగుతుంది. ఆ రైడ్ లో భాస్కర్ అకౌంట్లో 100 కోట్ల రూపాయలు ఉంటాయని తెలుస్తుంది. ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అకౌంట్లో 100 కోట్లు ఉండడమేంటి అనేది కథ.
ఓ కిందిస్థాయి బ్యాంక్ ఎంప్లాయ్… అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎలా అయ్యాడు? మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ ఒకే సారి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? దానివల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ ఇబ్బందుల నుంచి భాస్కర్ ఎలా తప్పించుకున్నాడు? ఈ కథలో బాంబే స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ హర్షద్ మెహ్ర పాత్ర ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
వెంకీ అట్లూరి సార్ మూవీని మనం చూశాం. ధనుష్ హీరోగా వచ్చిన ఈ మూవీ అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి హిట్ సాధించింది. అందుకే కాబోలు… దుల్కర్ సల్మాన్ ఈ డైరెక్టర్ ను ఎంచుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా హిట్ ఇస్తున్నాడు కదా… అందుకే దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేశాడు అనిపిస్తుంది.
కథ ఒప్పుకోవడానికి వెంకీ అట్లూరి డైరెక్షన్ మాత్రమే కాకపోవచ్చు. స్కామ్ 1992 వెబ్ సిరీస్ చూసింది దేశం మొత్తం. దుల్కర్ అందుకే ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే తెలుస్తుంది. స్కామ్ 1992 అనే వెబ్ సిరీస్ మొత్తం స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ రంగంలో జరిగిన కొన్ని స్కామ్స్ ను బయట పెట్టేలా ఉంది. దీన్నే బేస్ చేసుకుని వెంకీ అట్లూరి కథ రాసుకున్నాడు.
స్కామ్ 1992 ని కాస్త ఓపిక తెచ్చుకుని చూసి థ్రిల్ అయి ఉంటారు కదా… ఇప్పుడు ఈ లక్కీ భాస్కర్ మూవీని కూడా చూడటానికి కాస్త ఓపిక తెచ్చుకోవాలి. కానీ, కచ్చితంగా థ్రిల్ అవుతారు. ప్రతి విషయాన్ని డీటైల్ గా చూపించాలి అనుకున్నాడేమో డైరెక్టర్ అందుకే కాస్త ల్యాగ్ అనిపిస్తుంది.
ఫస్టాఫ్ మొత్తం మెయిన్ కథలోకి వెళ్తూనే ఆడియన్స్ ను సినిమా వెంటే నడిపిస్తుంది. మధ్య లో చిన్నగా సాగదీత వచ్చినా… సినిమాతోనే ప్రయాణిస్తారు. ఇంటర్వెల్ లో వచ్చే సీన్‌తో సెకండాఫ్ పై హోప్స్ పెట్టుకుంటారు. ఇక సెకండాఫ్ వచ్చే సరికి డీటైలింగ్ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. అదే వెళ్తూ వెళ్తూ ల్యాగ్ గా కూడా అనిపిస్తుంది.
చాలా వరకు ట్రిమ్ చేస్తే బాగుండు అనే ఫీల్ రాకమానదు. అయితే ఈ ల్యాగ్‌లో కూడా ఆడియన్స్‌కు… హీరో ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు.? ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది..? అనే క్వశ్చన్స్ ఆడియన్స్ కు వచ్చేలా కథనాన్ని క్రియేట్ చేశాడు వెంకీ అట్లూరి. సెకండాఫ్ లో కథనాన్ని కాస్త పరిగెత్తిస్తే బాగుండేది. అప్పుడు రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేది. క్లైమాక్స్ విషయానికి వస్తే… కాస్త డిఫరెంట్‌గా గానే ప్లాన్ చేశాడు. కొన్ని ట్విస్ట్ లను ప్లేస్ చేస్తూ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశాడు.
నటీనటులు విషయానికి వస్తే… దుల్కర్ సల్మాన్ పీక్స్ పెర్ఫార్మెన్స్. ఎలాంటి వంక పెట్టలేం. మీనాక్షీ చౌదరి ఉన్నంతలో పర్లేదు. సచిన్ ఖేడ్కర్, సాయి కుమార్ పాత్రలను మరింత ఉపయోగించుకోవాల్సింది. ఇక సినిమాటోగ్రాఫి విషయంలో నెగిటివ్స్ ఏం చెప్పలేం. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కథ, కథనానికి సరిపోయేలా సరిగ్గా సెట్ అయింది. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. కథ 1989లో సాగుతుంది. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే… సెకండాఫ్‌లో కొంతమేర పని చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
కథ
దుల్కర్ సల్మాన్
ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్‌లో ల్యాగ్
కథనంలో ఇంకాస్త గ్రిప్పింగ్ మిస్ అయింది..
మొత్తంగా… కాస్త ఓపిక ఉంటే… దీపావళికి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఉంటది. ఓపిక లేకపోతే ఇది కూడా అంతే.
Lucky Baskhar Movie Review and Rating – 2.5/5