చిత్రం – క
విడుదల తేదీ – 31 అక్టోబర్ 2024
నటీనటులు – కిరణ్ అబ్బవరం, తన్వీ రామ్, నాయన్ సారిక, అచ్యుత్ కుమార్ తదితరులు
దర్శకులు – సుజిత్ అండ్ సందీప్
నిర్మాత – చింత గోపాల కృష్ణ
సంగీతం – సామ్ సీఎస్
Ka Movie Review and Rating – 2 /5
Ka Movie Review : కోవిడ్ వల్ల లాభ పడింది ఓటీటీలు అయితే.. ఆ ఓటీటీల వల్ల లాభ పడింది కిరణ్ అబ్బవరం అనే చెప్పాలి. ఎందుకంటే అతని మొదటి సినిమా థియేటర్లలో చూసిన వాళ్ళు తక్కువ. కానీ ఓటీటీలో ఎక్కువ మంది చూశారు. అలాగే అతని రెండో సినిమా ఎస్.ఆర్.కళ్యాణ మండపం పాటలు కూడా ఆ టైమ్లో ఎక్కువగా వైరల్ అయ్యాయి. తర్వాత ఆ సినిమా థియేటర్లో కూడా సక్సెస్ సాధించింది. దీంతో వరుసగా అతనికి ఆఫర్ లు వచ్చి పడ్డాయి. వాటికి ఓకే చెప్పేసి ప్రేక్షకుల పై దండయాత్ర చేశాడు. ఈ క్రమంలో సమ్మతమే, వినరో భాగ్యము విష్ణుకథ తప్ప మిగిలినవి అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఏడాది గ్యాప్ తీసుకుని ‘క’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కంటే ప్రీ రిలీజ్ వేడుకలోని అతని ఎమోషనల్ స్పీచ్ వైరల్ అయ్యింది. గతంలో విజయ్ దేవరకొండ, విశ్వక్ లు ఇచ్చినట్టు సింపతీ స్పీచ్ ఇచ్చాడు కిరణ్. మరి అతని స్పీచ్ రేంజ్లో ‘క’ ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుంవుందాము రండి…
కథ :
అభినయ వాసుదేవ్ ( కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. అతనికి చిన్నప్పటి నుండీ పక్కవాళ్ళ ఉత్తరాలు చదవడం ఇష్టం. అయితే దొంగ చాటుగా వాళ్ళ మాష్టారు ఇంట్లో ఉత్తరం చదివితే అతను కోప్పడతాడు. దీంతో అక్కడి నుండి పారిపోయి వేరే ఊరిలో పనులు చేసుకుంటూ బ్రతుకుతాడు. అయినా అతనికి ఉత్తరాలు చదివే అలవాటుపోదు. అందుకోసం స్నేహితుడు సాయంతో కృష్ణగిరి అనే ఊరికి పోయి అక్కడ టెంపరరీ పోస్ట్ మాన్ జాబ్ సంపాదిస్తాడు. అయితే ఆ ఊరిలో 3 గంటలకే చీకటి పడిపోతూ ఉంటుంది. మరోపక్క తెల్లవారుజామున 5 గంటలకు అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. అయితే సత్య భామ, రాధ ఎవరు? అసలు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు? అసలు ‘క’ అంటే ఏంటి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
హీరోని ఒక అజ్ఞాత వ్యక్తి కిడ్నాప్ చేసి కథ చెప్పించడం. మధ్య మధ్యలో చిత్ర హింసలు చేయడం. ఇంటర్వల్ కి ఆ అజ్ఞాత వ్యక్తి మొహం రివీల్ చేయడం.. ఓటీటీల్లో వందల కొద్దీ థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి అలాంటి సీన్లు కొత్తగా అనిపిస్తాయా. పోనీ చెప్పుకోదగ్గ రేంజ్లో ఆ ట్విస్ట్ ఉందా అంటే.. అస్సలు లేదు. కామెడీగా నవ్వు తెప్పించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ని సేఫ్ చేసే సీన్ తప్ప ఏదీ ఆసక్తిగా ఉండదు. పైగా సెటప్ అంతా ‘కాంతార’ లా అనిపిస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్స్ కాంతార ప్రభావం ఎంత ఉందో ఈ సినిమాతో మరోసారి అందరికీ క్లారిటీ వచ్చింది. గతేడాది వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో కూడా కాంతార రిఫరెన్స్ లు చాలానే ఉంటాయి.
కాబట్టి ‘క’ లో అంత గొప్ప అంశాలు ఏమీ లేవు. ప్రీ క్లైమాక్స్ బ్లాక్ కొంతవరకు ఓకే. అలా అని అది సినిమా ఫలితాన్ని మార్చే రేంజ్లో ఉంటుందని కూడా చెప్పలేం. ట్విస్ట్..లు అన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. సో పెద్ద కిక్ ఇవ్వవు.ఈ సినిమాకి టెక్నికల్ టీం బాగా పని చేసింది. ముఖ్యంగా శామ్ సి ఎస్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సతీష్ రెడ్డి, డానియల్..ల సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు ఓకే.
నటీనటుల విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం నటనలో కొత్తదనం ఏమీ లేదు. ఇమేజ్ కి మించిన యాక్షన్, ఎలివేషన్..లు ఇతని పాత్రకు పెట్టి సహజత్వం మిస్ అయ్యేలా చేశారు. నయన్ సారిక రెగ్యులర్ హీరోయిన్లానే ఉంది. తాన్వి బాగా చేసింది. అచ్యుత్ వంటి నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
ప్రీ ఇంటర్వల్
ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ట్విస్ట్.. లు
స్క్రీన్ ప్లే
మొత్తంగా ఈ ‘క’ లో గ్రిప్పింగ్ నరేషన్ లోపించింది.ఓటీటీకి ఓకే అనిపిస్తుంది. థియేటర్లలో చూడాలంటే చాలా ఓ ఓపి’క’ అవసరం
Ka Movie Review and Rating – 2/5