బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 8.. 8వ వారం ప్రారంభం అవగా.. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా పూర్తి అయింది. ఇప్పుడు తాజాగా సరికొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 59వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో స్లీపింగ్ రేస్ ఛాలెంజ్ అంటూ కొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ ను తికమక పెట్టించారు బిగ్ బాస్. మరి ప్రోమో లో ఏముందో ఇప్పుడు చూద్దాం.
స్లీపింగ్ రేస్ ఛాలెంజ్ లో భాగంగా ముక్కు అవినాష్,టేస్టీ తేజ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా.. ఇంటి మెగా చీఫ్ విష్ణు ప్రియా వచ్చి టేస్టీ తేజ తో నెక్స్ట్ గేమ్ కి ఎనర్జీకి పంపించాలా వద్దా నిన్ను అంటూ చిన్నపిల్లాడిని చేసి మాట్లాడింది. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఏంటిది మరీ చిన్నపిల్లలా చేస్తున్నావ్.. నాకేం అర్థం కావట్లేదు అంటూ తెలిపాడు. నేనేమి నువ్వు సీరియస్గా చేస్తున్నావని అనట్లేదు తేజ అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది మెగా చీఫ్ విష్ణు ప్రియ. ఇక ప్రోమో విషయానికొస్తే బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్ స్లీపింగ్ రేస్. ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా ఒకరి తర్వాత మరొకరు మ్యాట్రస్ మీదకి దూకి స్లైడ్ చేస్తూ మీ టీం యొక్క మ్యాట్రస్ ని పూర్తిగా ఎండ్ లైన్ దాటించడం అంటూ తెలిపారు బిగ్ బాస్.
ఇక టాస్క్ మొదలవ్వగానే బజర్ మోగింది. ఇక తర్వాత కంటెస్టెంట్స్ పోటీ పడుతూ ఒకరి తర్వాత ఒకరు మ్యాట్రస్ పై దూకుతూ తమ టీం ని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. అయితే నయని పావని గట్టిగానే ట్రై చేసింది కానీ కొద్దిగా దూరంలో తన మ్యాట్రస్ ని ముందుకు స్లైడ్ చేయలేకపోయింది. ఆ తర్వాత అవినాష్ తమ టీం ని గెలిపిస్తూ మ్యాట్రెస్ ను ముందుకు స్లైడ్ చేశారు. ఇక తర్వాత రోహిణి, నయని పావని, పృథ్వీ ఒక టీం అయితే.. రోహిణి తనకు సపోర్ట్ చేయలేదని నయని పావని బాధపడింది. ఆ తర్వాత పృథ్వీ తో మాట్లాడుతూ.. ఒకే టీమ్ అన్నప్పుడు కలిసి ఉండాలా లేదా అంటూ కామెంట్ చేసింది. ఇక బ్లూ టీం కి చెందిన నిఖిల్, అవినాష్ ఇద్దరు ఒకే చోట చేరి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనమే టాస్క్ లో గెలవాలి. అప్పుడే మనం ఏదైనా డిసైడ్ చేసే హక్కు పొందుతాము అంటూ నిఖిల్ తెలిపాడు. ఆ తర్వాత రోహిణి నయని పావని సమస్యను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే నయని పావని ఒప్పుకోలేదు. ఏడవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పృథ్వీ , హరితేజ ఆమెను బ్రతిమలాడి తీసుకురావాలి అంటూ రోహిణి కామెంట్ చేసింది. ఆ తర్వాత హరితేజ నయని పావని ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి, ఆమెను టాస్క్ లోకి తీసుకొచ్చింది. మొత్తానికి అయితే రోహిణి కారణంగా నయని పావని ఏడ్చేసిందని చెప్పవచ్చు.