Congress Leaders On KTR: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. దీనిపై అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరించారు కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్‌కుమార్. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది.
బీఆర్ఎస్ ఎత్తులు బూమరాంగ్ అవుతున్నాయి. చేసిన సవాళ్లను ఆ పార్టీ నేతలు స్వీకరించలేకపోతున్నారు. వాటికి మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత విసిరిన సవాల్ ప్రకారం.. బుధవారం ఉదయం డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.
హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు కాంగ్రెస్ నేతలిద్దరు. అనంతరం నోరు విప్పారు బల్మూరి వెంకట్. రాజకీయాల్లో బాధ్యతమైన పదవుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ నేత చెప్పినట్టుగానే గతరాత్రి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లామన్నారు. బీఆర్ఎస్ నేతలెవ్వరూ రాలేదన్నారు. నాలుగు రోజుల వ్యవధిలో డ్రగ్స్ తీసుకున్నారేమో, అందుకే టెస్టుకు రావడానికి భయపడ్డారని చెప్పారు. ఆరోపణలపై తాము నిరూపించుకున్నామని, ఈ విషయంలో కేటీఆర్‌కు ఆ బాధ్యత లేదన్నారు.
ALSO READ: కేటీఆర్ నోరు మెదపరేం.. ఆ మహిళలకు న్యాయం జరిగేనా?
డ్రగ్స్ నివారించాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని, బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ కల్చర్‌ని ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ వెంకట్. మరోవైపు బల్మూరి వెంకట్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు.
ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రికి వచ్చి.. తాము రాలేదని నిందలు వేయడం సరి కాదన్నారు. మీడియాకు చెప్పి మాకు సమాచారం ఇస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా ఏఐజీ ఆసుపత్రి ముందు ఉండేవాళ్ళమన్నారు. మీడియా ముఖంగా సవాల్ చేసి, దొంగ చాటుగా ఆసుపత్రికి ఎందుకొచ్చావని ప్రశ్నించారాయన.
డేట్, టైం, ప్లేస్ ఎక్కడైనా మేం సిద్ధమేనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా అక్కడికి వస్తామన్నారు. డ్రగ్స్ టెస్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు మరోసారి అడ్డంగా బుక్కయ్యారు.
డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.
జన్వాడ ఫాం హౌస్ ఘటనలో బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు
హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న బల్మూరి వెంకట్, అనిల్ కుమార్ యాదవ్
కౌశిక్ రెడ్డి ఓ… https://t.co/5ne99y7SOy pic.twitter.com/DZKrxjJR1K
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2024