Salaar 2 Update : ప్రస్తుతం తెలుగులో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ గురించి మాట్లాడాల్సి వస్తే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. ఏ హీరో కూడా ఒక సినిమా కోసం తన కెరియర్ ను రిస్క్ లో పెట్టి ఐదు సంవత్సరాల టైం కేటాయించడు. అలాంటిది రాజమౌళి టాలెంట్ ను నమ్మి కేవలం బహుబలి ప్రాజెక్టు మీద టైం కేటాయించాడు ప్రభాస్. బాహుబలి సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించాడు. తెలుగు సినిమా స్థాయి కూడా విపరీతంగా ఆ సినిమాతో పెరిగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అయింది. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహూ, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ప్రభాస్ ఒక హిట్ సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూశారు. వారందరికీ సలార్ సినిమా ఉపశమనం కలిగించింది.
కే జి ఎఫ్ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీ పై తనదైన ముద్రను వేశాడు ప్రశాంత నీల్. కే జి ఎఫ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత తెలుగులో కూడా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని సాధించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు తాను రాసుకున్న మొదట కథను ఎక్కువ రీచ్ అయ్యేలా చూపించాలి అనుకున్నాడు ప్రశాంత్. అందుకే ఉగ్రం సినిమాను మళ్ళీ ప్రభాస్ తో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. కానీ ఈ విషయం ఇంకా బయటికి రాలేదు.
Also Read: SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..
ఇక రీసెంట్ గా జరిగిన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా షాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ కెరియర్ లో భారీ లైనప్ ఉంది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఫౌజీ చిత్ర యూనిట్ కూడా ప్రభాస్ కి పుట్టినరోజు విషెస్ తెలిపారు. ఇక సలార్ 2 సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుంది అని ఎదురుచూసే తరుణంలో ఏ అప్డేట్ కూడా రాలేదు. దీంతో సలార్ 2 ఆగిపోయింది అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న ప్రభాస్, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించబోయే ఫౌజి సినిమాలో కూడా ప్రభాస్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇక కల్కి సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. ఈ లైనప్ చూస్తుంటే సలార్ ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.