EPAPER

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB 29 Movie release date : ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని శిఖరం మీద కూర్చున్న పెట్టిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) కి ఉంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఇండియా అని ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చింది. ఇక తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్.ఎస్ రాజమౌళి సినిమాను చేయనున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ ఫిలిం మేకర్స్ తో కూడా చేతులు కలపనున్నారు జక్కన్న.


జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తారు అందులో సందేహం లేదు. ప్రేక్షకుడు ఎన్ని అంచనాలు పెట్టుకొని సినిమా థియేటర్ కు వెళ్లినా కూడా ఆ అంచనాలన్నిటినీ కూడా అవలీలగా దాటేస్తారు. కొంతమంది ఆడియన్స్ పల్స్ తెలియాలి అంటారు. అలా నిజంగా ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాలి. అందుకని ప్రతి సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టాడు. కొన్నిసార్లు సినిమా కథను కూడా సినిమా ఓపెనింగ్ రోజే చెప్పేస్తూ ఉంటాడు. ఇది చాలామంది రిస్క్ పాయింట్ అని అనుకుంటారు. వాస్తవానికి ఇదే సేఫ్ పాయింట్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఇది జక్కన్నకు తెలుసు కాబట్టి మర్యాద రామన్న,ఈగ వంటి సినిమాలకు కథ ముందుగానే చెప్పేసాడు.

అయితే జక్కన్నతో ఉన్న ఏకైక ప్రాబ్లం చెప్పిన టైంకి సినిమాను రిలీజ్ చేయకపోవడం. సినిమా మొదలు పెట్టినప్పుడు ఇక్కడికి పూర్తి చేస్తాం ఈ రోజున రిలీజ్ చేస్తామని అంచనాగా ఒక డేట్ చెబుతూ ఉంటారు. కానీ ఆ డేట్ కి సినిమా రాదు. ఇది మొదటిసారి కాదు చాలాసార్లు ఇలానే జరుగుతూ వచ్చింది. ఒక షాట్ విషయంలో గానీ ఒక సీన్ విషయంలో గానీ పూర్తిగా తను సంతృప్తి చెందితే గానీ ఆ సినిమాను ప్రేక్షకులకు అందించటానికి ఇష్టపడడు జక్కన్న. ఇక మహేష్ బాబు తో చేస్తున్న సినిమాను 2026 ఏప్రిల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏకంగా 24 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. 2026 ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అయితే మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ ఫ్యాన్స్ 2028 వరకు మహేష్ ను సినిమాలలో చూడలేము అని ఫిక్స్ అయి ఉండిపోయారు. కానీ ఈలోపే సినిమా వస్తే అంతకు మించిన ఆనందం ఇంకేమీ లేదు. అయితే జక్కన్న డేట్ మాత్రం చెప్పాడు గాని ఆ డేట్ కి వస్తాడని నమ్మకాలు ఎవరికీ లేవు.


Also Read : SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

ఒక నటుడుగా మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దర్శకుడు ఏం కావాలనుకుంటున్నాడు అది ప్రజెంట్ చేయడంలో మహేష్ చాలా స్పీడ్ గా ఉంటారు. అందుకనే పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు కూడా బిజినెస్ మెన్ లాంటి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసి రిలీజ్ చేశాడు. అలానే జక్కన్న విజన్ ను మహేష్ పర్ఫెక్ట్ గా అందుకొని చేస్తాడు అనడంలో సందేహం లేదు. ఒకవేళ అదే జరిగినట్లయితే జక్కన్న పని కూడా ఈజీ అవుతుంది. ఇవన్నీ జరిగితే 2026లో సినిమా వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.

Related News

Ka Movie Bookings : ‘క’ కనిపించంట్లేదు… కిరణ్ అబ్బవరం పరిస్థితి ఏంటి ఇప్పుడు..?

RaviTeja 75 Movie Title : మాస్ ‘జాతర’ కు ఇక పూనకాలే… టైటిల్, రిలీజ్ డేట్ డీటైల్స్ ఇవే..!

Naga Chaitanya – Sobhita Wedding Date: పెళ్లి డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్..!

Ka Movie : ‘క’ సినిమాకు ఎగ్జిబిటర్స్ హ్యాండిచ్చారా..? ఇప్పుడు డబ్బులు ఎలా..?

Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Salaar 2 Update : నిలిచిపోయిన సలార్ సీక్వెల్… ఫ్యాన్స్‌ను పిచ్చొళ్లను చేశారుగా…

×