Intinti Ramayanam Today Episode October 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ తన భార్యతో కలిసి పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకుంటారు. పంతులుగారు వచ్చి వారికి దండలు మార్పించి, అలాగే ఉంగరాలను కూడా పెట్టిస్తాడు. ఇక పంతులు పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని, చిన్నవారికి మీ ఆశీస్సులు తెలపండి అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్రప్రసాద్ తన తల్లి దగ్గర భార్యతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. మిగిలిన జంటలందరూ తమ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అందరు సంతోషంగా గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. పల్లవి ప్లాన్ చేసిన చేసిన వ్యక్తి లోపలికి వస్తాడు. అవనికి ఎలాగైనా షాక్ ఇవ్వాలని పల్లవి పెద్ద స్కెచ్ వేస్తుంది. అనుకున్నట్లే జరుగుతుందని సంబరిపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ పెళ్లిరోజు వేడుకలను ఇంట్లో వాళ్ళు ఘనంగా జరుపుతారు. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక మృణాళిని వాళ్ళ అమ్మ నాన్నకి దిష్టి తీసి గుమ్మడికాయని బయటపడేమని ప్రణవికిస్తుంది. ప్రణవి బయటకు రాగానే ఒక అతను కాలు మీద వేస్తుంది . అతను చాలా రూడ్ గా మాట్లాడుతాడు. ఇక ప్రణవి మాటకు మాట సమాధానం చెబుతుంది. అతను పల్లవి ఫోన్ చేస్తే వచ్చానని చెప్తాడు . అంతలోకే పల్లవి ఎక్కడికొచ్చి ఏమైంది ప్రణవి అని అడుగుతుంది. అతనితో నేను మాట్లాడతాను నువ్వు లోపలికి వెళ్ళనేసి పల్లవి ప్రణవి నీ లోపలికి పంపిస్తుంది. అతన్ని లోపలికి తీసుకొచ్చి ప్లాన్ ని ఎలా చేయాలని చక్రధర్ పల్లవి చెప్తారు. ఇక అతను అందరిలోకి మెల్లగా వెళ్తాడు. ఎవరికి అనుమానం రాకుండా గెస్ట్ లాగా తిరుగుతాడు.. ప్రణవి అందరికీ జ్యూస్ ఇస్తుంది కానీ అతనికి జ్యూస్ ఇవ్వదు. అవని అతనికి జ్యూస్ ఇస్తుంది. మూడు గ్లాసులు జ్యూస్ తాగడంతో కడుపులో తేడా చేస్తుంది.. బాత్రూం కెళ్ళి వస్తాడు. అందరూ మాట్లాడుకుంటుంటే కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు.
అతను తెచ్చిన బ్యాగ్ లోంచి నగలు కింద పడిపోతాయి. వాటిని తీసుకుపోతాడు. ఎవరు మీరు ఎవరు పిలిస్తే వచ్చారు అని అందరూ అతన్ని నిలదీస్తారు. ఇక రాజేంద్రప్రసాద్ అతని నువ్వు పిలిచావా అనేసి అడుగుతాడు అడుగుతాడు. నేను పిలవలేదు నాన్న అనేసి అక్షయ్ అంటాడు ఇక అందరూ ఎవరి పిలిచారు ఇంతకీ మీరు ఎవరు ఎవరి తరపున వచ్చారు అనేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అప్పుడు అతను అవని పిలిస్తే వచ్చానని చెబుతాడు.. నేను అవని బాయ్ ఫ్రెండ్ ని అవని పిలిస్తేనే నేను వచ్చానని చెప్తాడు. ఈ నగలు ఎవరివి అని అక్షయ్ అడుగుతాడు. నాకు డబ్బులు అవసరం అయితే అవని ఇచ్చింది .ఇప్పుడు మళ్లీ ఇద్దామని తీసుకొని వచ్చానని చెప్తాడు. అప్పుడు అందరూ అతన్ని కుల్లబడుస్తారు. ఇక అవని కూడా వాడిని నాలుగు పీకుతుంది.
పల్లవి మధ్యలో అడ్డుపడి కొట్టొద్దు అసలు వాడు చెప్పేది నిజమో కాదో తెలుసుకోమని చెబుతుంది. వాడు తీసుకొచ్చిన నగలు ఒరిజినల్ బంగారం బా లేక నకిలీవ్ అనేది తెలుసుకోవాలని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక సేటును రాజేంద్రప్రసాద్ ఆ నగలు ఎవరివో తెలుసుకోమని చెప్తాడు. అతను రెండు నగల్ని పరీక్షించి అవనీవే ఒరిజినల్ నగల అని చెప్తాడు. ఇక వచ్చిన అతన్ని కమల్ వినోద్ చితక్కొడతారు. అక్షయ్ వారిని పట్టుకుని నిజం చెప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. ఇక పల్లవి లోపలికి వచ్చి అసలు నగలు ఎలా మారాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నగలు ఎలా మారాయో నాకు తెలుసు అని అవని పల్లవికి షాక్ ఇస్తుంది. పల్లవికి జరిగిన విషయాన్ని చెబుతుంది. నువ్వు ఇలాంటి ప్లాన్లు ఇప్పటికైనా మానుకుంటే మంచిదని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చక్రధర్ పల్లవిని అడుగుతాడు. నీ బ్యాడ్ టైం నడుస్తుంది అందుకే ఇలా జరిగిందనేసి ఇద్దరు ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు.
ఇక రాజేంద్రప్రసాద్ కేకు కట్ చేయనని చెప్తాడు. వాడు ఎవడో మోసం చేశాడు వాడి గురించి ఆలోచించడం ఎందుకని ప్రతి ఒక్కరూ అతనికి చెప్పడంతో కేక్ కట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో అందరూ పూలు కడుతూ ఉంటారు. అప్పుడే అవనికి ఫోన్ వస్తుంది. అవనీ ఫోన్ మాట్లాడి నేను ఇప్పుడే వస్తున్నా అని బయటకు వెళ్తుంది అక్షయ ఆమెను ఫాలో అవుతాడు. అక్షయ్ అవని గురించి నిజం తెలుసుకుంటాడా? చక్రధరతన నాన్నని అవని తెలుసుకుంటుందా చూడాలి..