SSMB 29 Movie : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు. రీసెంట్ గా గుంటూరు కారం (Guntur Karam) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. వాస్తవానికి ఈ సినిమాకి ముందు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ కి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ అలానే మహేష్ కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ వలన ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ (Trivikram) సినిమా జరిగిన ప్రతిసారి ఒక విషయం రిపీట్ అవుతుంది. ఆ సినిమాకి థియేటర్స్ లో సరైన ఆదరణ లభించక పోయినా కూడా కొన్ని రోజుల తర్వాత టీవీలో వచ్చినప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. అరెరే ఇంత మంచి సినిమా థియేటర్లో కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదా అని అనిపిస్తుంది. అతడు ఖలేజా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక గుంటూరు కారం కొంత మేరకు కమర్షియల్ గా సక్సెస్ సాధించి పర్వాలేదు అనిపించింది.
ఒక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్నాడు మహేష్ బాబు. ఇప్పటివరకు రాజమౌళి చాలామంది హీరోలను స్టార్ హీరోస్ ని చేశాడు. కానీ ఇప్పటివరకు ఎస్.ఎస్ రాజమౌళి స్టార్ హీరోలతో పని చేయలేదు. మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమాను చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ (RRR) సినిమా తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్ కు వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళికి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అని మనకు తెలియనిది కాదు. అయితే ఈ సినిమాతో భారీ టార్గెట్ వేసింది చిత్ర యూనిట్ దాదాపు 24 వేల కోట్ల వరకు ఈ సినిమా టార్గెట్ చేస్తుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read : Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎవరి రెమ్యూనరేషన్ ఫైనల్ కాలేదు. ఎవరు డబ్బులు తీసుకోకుండా ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి వచ్చే లాభాల్లో 30% మహేష్ బాబుకి 20% ఎస్ ఎస్ రాజమౌళి కి వెళ్ళనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రాజమౌళికి ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గర కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి అంచలంచెలుగా కెరియర్ లో ఎదుగుతూ తెలుగు సినిమా స్థాయిని కూడా ఎదిగేలా చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఏ రేంజ్ హిట్టు కొడతాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మహేష్ బాబు లుక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మహేష్ ఎప్పుడు పడితే అప్పుడు ఎయిర్పోర్టులో దర్శనం ఇవ్వడం వలన ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో అందరికీ ఒక అవగాహన వచ్చింది.