trinayani serial today Episode: పిన్ని పాప గురించి ఇంట్లో వాళ్లు చెప్తారా? బయటి వాళ్లు చెప్తారా? అని విశాల్ అడగ్గానే గాయత్రి అక్క పునర్జన్మ గురించి ఇంట్లో వాళ్లకు తెలుసని ఓ పుణ్యాత్ముడు చెప్పాడు అని అహల్య చెప్పడంతో విశాల్, హాసిని షాక్ అవుతారు. ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకుని భయపడతుంటారు. అది ఎవరో అనేది తెలియాలి అంటాడు విక్రాంత్. దీంతో నాకు మొదటి నుంచి అనుమానం ఉంది అంటుంది సుమన.
దీంతో ఇది అన్యాయం కదా బాబుగారు తెలిసి కూడా మనకు చెప్పలేదంటే ఎంత ధ్వేషం ఉందోనని అనిపిస్తుంది అని నయని బాధపడుతుంది. దీంతో వల్లభ మాకు తెలుసా..? అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతలో విక్రాంత్ మనలో మనం ఎన్ని మాట్లాడుకున్నా లాభం లేదు. ఎందుకంటే నిజం తెలిసివాళ్లు వాళ్లకై వాళ్లు నిజం చెప్పాలి కాబట్టి అంటాడు. దీంతో నయని ఏడుస్తూ దయచేసి నిజం తెలిసిన వాళ్లు ఎవరో నా పెద్ద బిడ్డ గురించి చెప్పండి అని వేడుకుంటుంది. దీంతో అక్కా నువ్వు బాదపడకు… అహల్య అత్తయ్యా గారు ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి అని సుమన అడుగుతుంది.
ఆ పరిష్కారం అమ్మవారే చూపిస్తారు అని నయనిని అమ్మవారి మీద భారం వేసి మొక్కి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టు అని చెప్తుంది అహల్య. దీంతో సరేనని కొబ్బరికాయ తీసుకుని అమ్మవారికి మొక్కి నా బిడ్డ గురించ తెలిసివాళ్లు ఎవరో నాకు తెలిసేలా చేయి తల్లి అంటూ కొబ్బరికాయ కొడుతుంది నయని. రెండేళ్లుగా సకలసుఖాలు అనుభవించింది ఈ పాప. ఇప్పుడు మా అక్క బిడ్డ వస్తే ఈ పాపను ఎవరు పట్టించుకుంటారు అని అంటుంది సుమన. దీంతో విక్రాంత్ సుమనను తిడతాడు. నయని మాత్రం నాకు ఎవరైనా ఒక్కటే సుమన అంటుంది.
అయితే నువ్వు అలా అనుకుంటే నా బిడ్డ పేరు మీద కూడా ఇంతో అంతో ఆస్థి రాసేదానికి అక్కా అంటుంది సుమన. ఇక్కడికి వచ్చి ఆస్థుల గురించి మాట్లాడకండి అంటూ హెచ్చరిస్తుంది అహల్య. నయనిని అమ్మవారికి హారతి ఇచ్చి పూజ పూర్తి చేయ్యమంటుంది అహల్య. అలాగేనని నయని హారతి ఇచ్చి అమ్మవారికి మొక్కుతుంది. ఇంతలో ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలని హాసిని పూనకం వచ్చినట్టు అరుస్తుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. మా ఆవిడను అమ్మవారు పూనినట్టు ఉన్నారు అంటాడు వల్లభ. ఇంతలో గాయత్రిదేవి ఆచూకి తెలుసుకోవడానికి వచ్చారా…? అంటుంది హాసిని.. అవునని తిలొత్తమ్మ.. పాప ఆచూకి చెప్పకపోయినా.. మాలో ఎవరికి తెలుసో చెప్పమ్మా అంటుంది.
నాకు తెలుసు.. నీకు తెలుసని.. నాకు తెలుసే అంటూ తిలొత్తమ్మను తిడుతుంది హాసిని.. నాకు తెలియదు అంటూ తిలొత్తమ్మ అనగానే నీకు తెలుసని నాకు తెలిసే నిజం చెప్తావా…? లేదా అంటూ తిలొత్తమ్మ మీదకు వెళ్లబోతుంటే హాసినికి ఫోన్ వస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన హాసిని హలో అనగానే అవతలి నుంచి పర్సనల్ లోన్ గురించి ఫోన్ చేశామని చెప్తాడు. ఆ వ్యక్తిని హాసిని తిడుతుంది. నేను ఇప్పుడే సూపర్ పర్మామెన్స్ చేస్తుంటే మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావా? అంటుంది. బాంకు వాళ్లు అనుకుంటా పని పాటా ఉండుదు అని ఆ రెడీ పట్టుకోండి.. పట్టుకోండి అంటూ అందరూ తనను గుర్రుగా చూస్తేంటే షాకింగ్ గా ఉండిపోతుంది. దీంతో తిలొత్తమ్మ కోపంగా వెళ్లి హాసినిని కొడుతుంది. ఎంత నాటకం ఆడింది చూడండి అంటూ తిడుతుంది.
వల్లభ ఆ బ్యాంకు ఎవడో టైంకు ఫోన్ చేశాడు అంటాడు. నయని ఏడుస్తూ అక్కా నువ్వు వేరే ఏ విషయంలో ఆట పట్టించినా సరదాగా తీసుకునేవాళ్లం. కానీ ఇక్కడకు వచ్చింది నా కన్నకూతురు కోసం గాయత్రి అమ్మ గారి పునర్జన్మ కోసం అంటూ ఏడుస్తుంది. దీంతో హాసిని సారీ చెప్తుంది. తర్వాత నయని అమ్మవారిని మనఃస్పూర్తిగా మొక్కుతూ నా బిడ్డ ఆచూకీ తెలుస్తుందని గాయత్రి అమ్మగారు కూడా చెప్పారు. తను ఏ రూపంలో ఉందో ఎక్కడ ఉందో నువ్వు చూపించకపోయినా.. తను ఎవరికి తెలుసో వాళ్లనైనా నాకు చూపించు అమ్మా అంటూ వేడుకుంటుంది. ఇవాళ కనక నా బిడ్డ జాడ తెలుసుకోకపోతే ఇక నేను ఇంటికి కూడా వెళ్లను ఇక్కడే ఉంటాను.. ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను. అని మొక్కుతుండగానే గుడిలో గంటలు మోగుతాయి.
అమ్మవారిలోంచి ఒక కాంతి కిరణం బయటకు వస్తుంది. ఆ కిరణం విక్రాంత్ దగ్గరకు వెళ్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి విక్రాంత్ మీద కిరణ పడి మాయమైంది అంటుంది హాసిని. నయని ఏడుస్తూ విక్రాంత్ దగ్గరకు వెళ్లి నా బిడ్డ ఎక్కడుందో తెలుసా? అని అడుగుతుంది. తెలియదని విక్రాంత్ చెప్పగానే నయని కోపంగా విక్రాంత్ గల్లా పట్టుకుంటుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.