EPAPER

Russia Nuclear Drill: అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించిన రష్యా.. అయోమయంలో అమెరికా?..

Russia Nuclear Drill: అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించిన రష్యా.. అయోమయంలో అమెరికా?..

Russia Nuclear Drill| ఉక్రెయిన్, రష్యా మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ ఆయుధాల డ్రిల్స్ ప్రారంభించమని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అక్టోబర్ 29 2024 రాత్రి పుతిన్.. సైన్యానికి ఈ ఆదేశాలు జారీ చేశారు. రష్యా సైన్యాధికారులు అణు ఆయుధాల డ్రిల్స్ ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు అని పేర్కొన్నారు.


అయితే రెండు వారాల క్రితమే అణు ఆయుధాల డ్రిల్స్ రష్యా సైన్యం ప్రారంభించింది. కానీ తాజాగా ఆ డ్రిల్స్ పూర్తి స్థాయిలో జరగబోతున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలతో ఉక్రెయిన్‌కు సహాయం చేస్తున్న అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత నాలుగు నెలలుగా యుద్ధంలో ఉక్రెయిన్ తరపున నాటో కూటమి దళాలు రష్యా స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. పైగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన దేశాలు లాంగ్ రేంజ్ మిసైల్స్ సరఫరా చేస్తున్నాయి. ఈ మిసైల్స్ తో ఉక్రెయిన్ యుద్ధంలో గత నెల రోజుల్లో రష్యా భూభాగంపై దాడు చేసి పై చేయి సాధించింది. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ వద్ద ఉన్న అణు ఆయుధాల ఉపయోగించబోతున్నామని ముందుగానే పాశ్చాత్య దేశాలకు పెద్ద వార్నింగ్ ఇచ్చారు.

పాశ్చాత్య దేశాల సాయంతో యుద్ధం ఉక్రెయిన్ తమపై దాడులు చేస్తోంది కాబట్టి.. తమ మాతృదేశం రక్షణ కోసం అణు ఆయుధాలు ఉపయోగిస్తామని చెప్పారు. చెప్పినట్లే ఇప్పుడు అణు ఆయుధాల డ్రిల్స్ ప్రారంభించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు వరకు రష్యా అణు ఆయుధాల పాలసీ ప్రకారం.. అణు ఆయుధాలు లేని ఏ దేశానికి వ్యతిరేకంగా కూడా వాటిని ఉపయోగించకూడదు. కానీ నెల రోజుల క్రితం పుతిన్ తమ దేశ రాజ్యంగంలో అణు ఆయుధాల పాలసీలో మార్పులు చేశారు. తమ దేశ రక్షణ కోసం శత్రు దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నా.. లేకున్నా రష్యా వారిపై అణు దాడి చేస్తుంది.


Also Read: పుతిన్‌, ఎలన్ మస్క్‌ మధ్య రెండేళ్లుగా సంప్రదింపులు.. తైవాన్‌పై చైనా కుట్ర?

తాజాగా అణు ఆయుధాల డ్రిల్ ప్రారంభించమని ఆదేశాలు జారీ చేస్తూఇలా అన్నారు. “బాలిస్టిక్ మిసైల్స్, క్రూరిజ్ మిసైల్స్ వినియోగించడంతో పాటు అణు ఆయుధాల వినియోగం కూడా రష్యా చేస్తుంది. అయితే అణు ఆయుధాల ఉపయోగం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. కానీ యుద్ధంలో ఉపయోగం కోసం వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలి. శత్రు దేశాలతో ఆయుధాల విషయంలో రష్యాకు పోటీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా వద్ద సరిపడ సంఖ్యలో కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి.” అని చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడేందుకు ఉత్తర కొరియాకు చెందిన 10000 పైగా సైనికులు కొన్ని రోజుల క్రితం బయలుదేరారని తెలియగానే ఉక్రెయిన్, నాటో కూటమి దేశాలు మండిపడ్డాయి. వీరంతా ముందుగా రష్యా సైన్యంతో కలిసి 20 రోజులపాటు రష్యా భూభాగం ట్రైనింగ్ తీసుకొని ఆ తరువాత యుద్ధరంగంలో దిగుబోతున్నారని.. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని.. అలా చేయడం నియమాలకు విరుద్ధమని అమెరికా డెప్యూటీ పెంటాన్ సెక్రటరీ సబ్రినా సింగ్ మీడియాకు తెలిపారు.

దీనిపై పుతిన్ స్పందిస్తూ.. యుద్ధంలో తాము ఏం చేయాలో తమకు తెలుసునని.. ఉక్రెయిన్ నాటో దళాలతో కలిసి పోరాడుతుంటే.. రష్యా కూడా చేయాల్సింది చేసి తీరుతుందని చెప్పారు.

Also Read: ‘కమలా హ్యారిస్ వల్ల ప్రపంచ యుద్ధం రావొచ్చు.. రష్యా, చైనాతో ఆమె డీల్ చేయలేదు’

ప్రపంచంలోనే అణు ఆయుధాలు ఎక్కువగా కలిగిన దేశం రష్యా. రెండో స్థానంలో అమెరికా ఉంది. అయితే ఈ రెండు దేశాల వద్దనే ప్రపంచంలోని మొత్తం 88 శాతం అణు ఆయుధాలున్నాయి. అందుకే అమెరికా నేతృత్వంలోని నాటో కూటిమి నేరుగా రష్యాతో తలపడితే మూడో ప్రపంచ యద్ధం తప్పదని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ముందుగానే కూటమి దేశాలకు హెచ్చరించారు. కానీ ఉక్రెయిన్‌కు చేయాల్సిన సాయం చేస్తూనే ఉంటామని చెప్పారు.

Related News

Naim Qassem Israel: ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు

Biden Diwali Celebrations: అమెరికా వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు.. ఇండియన్స్‌కు బైడెన్ దావత్

Israel Truck attack: ఇజ్రాయెల్‌ రాజధానిలో ట్రక్కు దాడి.. 35 మందికి తీవ్ర గాయాలు!

Trump Melania Dance: న్యూయార్క్‌లో అట్టహాసంగా ట్రంప్ ఎన్నికల ప్రచారం.. వేలమంది జనం, సెలబ్రిటీలు, భార్యతో డాన్స్..

22,000 kg cheese stolen: 22 వేల కిలోల జున్ను చోరీ.. చాలా ఈజీగా పనికానిచ్చిన దొంగలు..

Beijing on US Taiwan : తైవాన్ పై గురి పెట్టిన చైనా.. అమెరికా ఎంటర్.. డ్రాగన్ కు ఇక చుక్కలే!

×