EPAPER

Lakshmi Devi: దీపావళికి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు ఐదు మార్గాలు.. ఇదిగో ఇలా చెయ్యండి

Lakshmi Devi: దీపావళికి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు ఐదు మార్గాలు.. ఇదిగో ఇలా చెయ్యండి

Lakshmi Devi: దీపావళి వచ్చిందంటే లక్ష్మీదేవి పూజ ఘనంగా నిర్వహించుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు ఎలా పూజ చేయాలో తెలుసుకోండి. దీపావళి పూజ 5 రోజులు పండగ చెప్పుకుంటారు. ధన త్రయోదశి నాడు ఈ పండుగ మొదలవుతుంది. దీపావళి వేడుకలకు నాంది పలికేది ధన త్రయోదశి. ఈ ధన త్రయోదశి రోజు భక్తులు ఆయుర్వేద దేవత అయిన ధన్వంతరిని పూజిస్తారు. అతడిని సంపద, శ్రేయస్సును ఇమ్మని కోరుతారు. అలాగే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ధన త్రయోదశి రోజు కొన్ని రకాల వస్తువులు కొంటే ఆ ఇల్లు సకల సంపదలతో అలరారుతుందని చెబుతారు. గృహాన్ని శుభ్రం చేసి ఘనంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు. ఈరోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజూ ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయి.


కమల పూలతో పూజ
దీపావళికి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు కొన్ని పనులు చేయండి. దీపావళి రోజు కమల పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని కమల పువ్వులతోనే పూజించేందుకు ప్రయత్నించండి. ఆమె మీ భక్తికి ధరించి మీకు సమృద్ధిగా ధనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా అష్టకమలం అంటే ఎనిమిది రేకులతో కూడిన కమల పువ్వును తెచ్చి పూజించేందుకు ప్రయత్నించండి. లక్ష్మీదేవి తామర పువ్వు నుండే పుట్టిందని చెబుతారు. బురద నీటిలో పుట్టినా కూడా కమలం ఆ బురదని అంటకుండా ఎత్తుగా పెరుగుతుంది. దాని రేకులు కూడా మురికిని తాకవు. ఇది పైకి ఎదగగల సామర్ధ్యాన్ని సూచిస్తుందని అంటారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ ఇక్కడ ఇచ్చిన శక్తిమంత్రాన్ని చదవండి. ఇది మీ పూజలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః


మహాలక్ష్మీ యంత్రం
శ్రీ మహాలక్ష్మి యంత్రం మార్కెట్లో లభిస్తుంది. ఈ శ్రీమహాలక్ష్మి యంత్రాన్ని ఇంటికి తెచ్చి పూజ గదిలో ఉంచి ఆరాధించడం మొదలు పెట్టండి. ఇది సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలా చేయడంలో శ్రీ మహాలక్ష్మి యంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. మహాలక్ష్మి యంత్రం దైవిక శక్తిని ప్రసారం చేస్తుందని, ఆర్థిక భద్రతను అందిస్తుందని, జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పుకుంటారు.

ఉసిరికాయ
ఉసిరికాయలను కొని లక్ష్మీదేవికి సమర్పించండి. ఉసిరికాయలను లక్ష్మీదేవితో సమానంగా చెబుతారు. ఉసిరికాయలు అదృష్టాన్ని సూచిస్తాయని అంటారు. ఉసిరికాయలను అమ్మవారికి పెడితే అవి ప్రసాదంగా మారుతాయి. ఆ ఉసిరికాయలను మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలిసి తింటే ఎంతో మంచిది. మీ ఇంటికి దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే దానిని పువ్వులు, అక్షింతలు, చందనం, పసుపుతో అలంకరించి పూజించండి.

Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి? జపించాల్సిన లక్ష్మీ మంత్రాలు ఏవి?

ఇంటి ముందు ముగ్గు
లక్ష్మీదేవికి శుభ్రంగా, అందంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గు రూపంలో వేయండి. లేదా అందమైన పద్మాల ముగ్గు వేసినా మంచిదే. ముగ్గు వేసిన ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని చెప్పుకుంటారు.

శంఖం
శంఖాన్ని కొని శ్రీ మహాలక్ష్మి విగ్రహం ముందే ఉంచండి. ఇది కూడా ఇంటికి శ్రేయస్సును, సంపదను తెస్తుందని హిందువుల నమ్మకం. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిందని చెబుతారు. అలాగే శంఖం కూడా సముద్రం నుంచి ఉద్భవించినదే. ఈ శంఖాన్ని పూజ గదిలో అమ్మవారి దగ్గర ఉంచడం వల్ల ఎంతో పవిత్రమైన ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు ఆరాధనలో పసుపు రంగు శంఖాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వీలైనంతవరకు పసుపు రంగు శంఖాలు దొరికితే కొనండి. లేదా పసుపు గుడ్డలో పసుపు శంఖాలను కట్టి ఉంచితే కుబేరుడు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు. చిన్న చిన్న శంఖాలను ఇంటికి తెచ్చేటప్పుడు అవి కచ్చితంగా 1, 3, 5, 7, 9, 11, 21, 51 వంటి బేసి సంఖ్యలోనే ఉండేలా చూసుకోండి.

Related News

Diwali 2024 Wishes: మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా ?

Diwali Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి? జపించాల్సిన లక్ష్మీ మంత్రాలు ఏవి?

Horoscope October 30 : మేషం నుంచి మీనం వరకు అక్టోబర్ 30 వ తేదీ ఎలా ఉంటుందంటే ?

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి

Mercury Transit: నవంబర్‌లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. మీ ఖజానాను నింపనున్న బుధుడు

×