Satyabhama Today Episode October 30th : నిన్నటి ఎపిసోడ్ లో సత్య క్రిష్ లతో పాటుగా నందిని హర్ష వాళ్ళు కూడా వస్తారు. వాటర్ పార్క్ లో ఎంజాయ్ చేస్తారు. సత్య ను ఎలాగైనా లోబర్చుకోవాలని సంజయ్ చూస్తాడు. కానీ సత్య అతని చెంప పగల గోడుతుంది. సత్య మీద కోపాన్ని సంధ్య పై చూపిస్తాడు.. సంధ్యను అడ్డు పెట్టుకొని నిన్ను నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటాడు. అటు నందినిని ఎవరో ఏడ్పిస్తుంటే హర్ష గొడవ పడతాడు. కానీ వాళ్ళ చేతిలో తన్నులు తింటాడు. అలాగే క్రిష్ వాళ్ళను చితక్కోడుతాడు. వాళ్లంతా అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. నందిని వాళ్ళు వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని హర్ష వాళ్ళు వెళ్లగానే క్రిష్ మనం కూడా వెళ్దాం అనేసి సత్యను తీసుకుని బయలుదేరడానికి వెళ్తాడు. క్రిష్ తాగిన విషయం సత్యకు తెలిసిపోతుంది. నేను డ్రైవ్ చేస్తాను అనేసి సత్య అంటుంది. తాగి డ్రైవ్ చేస్తే ఎవరో ఒకరు పట్టుకుంటారు ఎందుకొచ్చిన పని? అప్పుడు మళ్ళీ ఇంకా ఆలస్యం అవుతుంది అనేసి సత్య డ్రైవ్ చేస్తుంది. ఈరోజు నేను అసలు మర్చిపోలేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ప్రపంచంలో కల్లా నేనే సంతోషంగా ఉన్నాను అనేసి క్రిష్ మురిసిపోతుంటాడు. ఈ ప్రపంచంలో నా కన్నా సంతోషకరమైన వాళ్ళు ఎవరు లేరని ఇంగ్లీషులో ఎలా చెప్పాలని సత్యని అడిగి మరి బయట చెప్తూ రచ్చ చేస్తాడు. ఈరోజు ఎంత హాయిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ వస్తే బాగుండు అనేసి క్రిష్ సత్య తో అంటూ ఉంటాడు. అలా ఇద్దరు సరదాగా గడిపిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు.
ఇక మహదేవయ్య ఇంటికి వెళ్ళగానే తలకు కట్టు కట్టుకొని కనిపిస్తాడు. మహాదేవయ్యను చూసి సత్య క్రిష్లు షాక్ అవుతారు.. క్రిష్ టెన్షన్ పడుతూ ఏమైంది బాబు అనేసి మహాదేవయ్యను అడుగుతాడు. ఇక భైరవి వాళ్లకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు తిట్టేస్తుంది. మీ అన్న జైల్లో ఉన్నాడు నువ్వేం చెప్పావు? బాపు ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని చెప్పి మరీ తీసుకెళ్లావ్ ఇప్పుడు అటాక్ జరిగింది. నువ్వు నీ పెళ్ళాంతో షికారుకెళ్లావ్ ఇక్కడ బాపు ప్రాణాలతో బయటపడి బయటకు వచ్చాడు అని భైరవి కృష్ణ తిడుతుంది.బాపు నీ మీద అటాచ్ చేసింది ఎవరు బాపు చెప్పు అనేసి క్రిష్ అని అడుగుతాడు. కానీ మహదేవయ్య మాత్రం ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే ఏం జరగలేదు కదా నువ్వు సంతోషంగా గడికి వచ్చావు కదా అనేసి కృష్ణ అంటాడు. భైరవి పెద్దోడినింటే ఇలా చేసేవాడు కాదు బాబు అంటే వాడికి ఎంత ఇష్టమో కనిపెట్టుకొని ఉండేవాడు అనేసి రుద్ర గురించి మధ్యలో మాట్లాడుతుంది. రేణుక ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే అత్తయ్య అనేసి అంటుంది. ఇక మహదేవయ్య భైరవిని తిడతాడు. వాళ్ళు ఏదో సరదాగా ముచ్చట వచ్చినాంచి ఇదే లొల్లినా ఇంకా ఆపేసే అనేసి బైరవికి చెప్తాడు.
ఇక క్రిష్ వాళ్ళ బామ్మ కూడా మొదటిసారి వాళ్ళు బయటికి వెళ్లి వచ్చారు సరదాగా గడిపారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావని భైరవినే తిడుతుంది. దానికి కోపంతో రగిలిపోయిన బైరవి నీ కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు అత్తమ్మ ఇది మర్చిపోతున్నావా నువ్వు అనేసి అరుస్తుంది.. ఇక నందిని హర్ష సంధ్యను వాళ్ల నాన్న బాగా ఎంజాయ్ చేశారు కదా అనేసి అడుగుతాడు. దానికి సంధ్య బాగా ఎంజాయ్ చేసాం వాటర్ పార్క్ కి వెళ్ళాం. సత్య అక్క బావ కూడా వచ్చారు అనేసి చెప్తుంది. అప్పుడు నందిని వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు అనేసి అంటుంది. మీ ఎంజాయ్మెంట్ తర్వాత కానీ ఇప్పుడు వెళ్లిన పని ఏమైంది అనేసి హర్ష వాళ్ళ నాన్న అడుగుతాడు. వీసా పనులు పూర్తయిపోయాయి. టికెట్ కూడా వచ్చేసింది మరో రెండు రోజుల్లో వీసా వచ్చేస్తుంది. తన వెళ్ళిపోతుందనేసి హర్ష చెబుతాడు.. ఇక మైత్రి తన ఫ్రెండ్ శృతి తో మాట్లాడుతూ ఉంటుంది. వెళ్లకుండా నువ్వే చేయాలని మైత్రి శృతి తో చెప్తుంది.. నేను అమెరికాకు పోతానని చాలా సంతోషంగా ఉన్నావు నందిని కానీ నేను నా భర్త హర్ష తో కలిసి ఫారిన్ కు హనీమూన్ కి వెళ్తాను అనేసి చెప్తుంది..
సత్య మహదేవయ్యకు నిజంగానే గాయమైందా లేక నాటకం ఆడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మహదేవయ్య సత్య దగ్గరికి వస్తాడు. మొగుడితో బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావుగా నా మీద ఎటువంటి ఎటాక్ జరగలేదు అని సత్యకు నిజం చెప్తాడు. తన తలకున్న కట్టును కూడా తీసేసి చూపిస్తాడు. అప్పుడప్పుడు ఇలా చేస్తే క్రిష్ నా చేతిలోంచి జారిపోకుండా ఉంటాడని మహదేవయ్యా సత్యతో అంటాడు. ఇక సత్య క్రిష్ దగ్గరికి వెళ్తుంది.. క్రిష్ ఎమోషనల్ అవుతుంటే ఆపుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మీ నాన్నకు అసలు గాయమే తగరలేదు నేను చూశాను అనేసి క్రిష్ తో సత్యం అంటుంది. అది నమ్మిన క్రిష్ బాబు ఆయింట్మెంట్ రాస్తాను అది తీయవానేసి అంటాడు. రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్య నాటకం బయట పడుతుందేమో చూడాలి..