మన దేశంలోని అడవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ముళ్ళ పొదల్లా కనిపిస్తాయి. వాటిని తవ్వితే భూమిలో ఈ దుంప లభిస్తుంది. ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్ వంటి పొడి బంజర భూములలో ఈ దుంప లభిస్తుంది. కరువు, ఆహార కొరత ఉన్న సమయాల్లో ఈ దుంపలను తినే అటవీ వాసులు జీవించారని చెప్పుకుంటారు.
శ్రీరాముడు తిన్న దుంప
నిజానికి రామ్ కందమూల్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే పీచు పదార్థము కూడా ఎక్కువే. తెల్లగా, జ్యూసీగా ఉండే ఈ దుంప రుచిలో తీపిగా ఉంటుంది. ఈ దుంపను తినడం వల్ల దాహం కూడా వేయదు. శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి శక్తి కూడా అందుతుంది. ఎక్కడైతే తక్కువ ఆహారం పండుతోందో అక్కడే ఈ రామ కండ మూల్ వల్ల ఎక్కువమంది ప్రజలు జీవించగలరు. అందుకే అడవుల్లో అందరూ ఇలాంటి దుంపలను తిని జీవించేవారు.
ఈ రామ కంద మూల్ దుంపలు నీరు లేని పొడి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పోషక విలువలు, ఔషధ ప్రయోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటికీ గ్రామాల్లో అప్పుడప్పుడు ఈ కందమూలం దొరుకుతూ ఉంటుంది. దీన్ని ఇప్పటికీ ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువే. నేటి తరానికి దీని పేరు కూడా తెలియదు. ఇలా అంతరించిపోతున్న ఆహారాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తినాలంటే చాలా కష్టం. నగరాల్లో, పట్టణాల్లో ఈ దుంపలు దొరకవు. గ్రామాల్లోకి వెళ్లి వెతుక్కోవాలి. అది కూడా నీరు లేని బంజరు భూముల్లోనే ఇవి పెరుగుతాయి కాబట్టి, అలాంటి ప్రదేశాల్లో వీటిని వెతికితే దొరికే అవకాశం ఉంది.