EPAPER

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Ka Movie Pre Release Event : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈయన నటించిన సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం ‘క ‘ అనే మూవీతో ప్రేక్షకులను పలకరిచిందేకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సుజిత్‌, సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 31న రాబోతుంది . ఈ సినిమాతో హిట్ కొట్టాలని కిరణ్ అండ్ గత కొద్దీ రోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు ఆడియన్స్ ను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


‘క ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రయాణంలో కిరణ్ ఇన్ని కష్టాలు పడ్డాడా? ఇన్ని అవమానాలు ఎదొర్కొన్నాడా? అనే సానుభూతి కలిగింది. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి హీరోగా మారాడు. తన తొలి సినిమా బడ్జెట్ 60 లక్షలు. ఇప్పుడు పాతిక కోట్లతో తనతో సినిమా తీసే స్థాయికి ఎదిగాడు. అతని సినిమాలు హిట్ అవ్వడంతో కిరణ్‌ని నమ్మి నిర్మాతలు పెట్టుబడి పెడుతున్నారు. కిరణ్ కోసం దర్శకులు కథలు రాస్తున్నారు. ఎక్కడో మారు మూల నుంచి, ఓ అతి సాధారణ కుటుంబం నుంచి, కూలి పని చేసుకొని పొట్ట నింపుకొనే స్థితి నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఇంత కంటే విజయం ఏముంటుంది?, ఆ కుటుంబాన్ని పోషించడానికి తల్లి ఎన్ని బాధలు పడిందో చెబుతుంటే… కిరణ్ ఆవేదన, బాధ అర్థమవుతాయి.. తన బ్యాగ్రౌండ్ గురించి ఈ సందర్బంగా కిరణ్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ సినిమా వల్లే కిరణ్ ఎమోషనల్ అయ్యాడా? 


‘క ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కిరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సినిమా గురించి చెప్పడంతో పాటుగా ఓ సినిమా వల్ల అతను ఆవేదన చెందాడు. బాయ్స్ హాస్టల్ అనే మూవీ వల్లే కిరణ్ బాగా ఎమోషనల్ అయ్యాడని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ‘కిరణ్‌తో మీ ప్రాబ్లం ఏమిటి? కిరణ్ అనేవాడు ఎదగ కూడదా’ అని సూటిగా సంధించిన ప్రశ్న చాలామంది గుండెల్లో గుచ్చుకోవడం ఖాయం. చిత్రసీమ అందరిదీ. కష్టపడేవాడికే ఇక్కడ ఫలితం దక్కుతుంది. కిరణ్ నిజంగానే కష్టపడితే, దానికి తగిన ప్రతిఫలమే అందుకొంటాడు. మధ్యలో ఎవరు ఎంత కిందకు లాగాలని ప్రయత్నించినా, సూటి పోటి మాటలతో వెక్కిరించినా ఉపయోగం ఉండదు. ఏమీ లేని చిరంజీవి మెగాస్టార్ అవ్వలేదా? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని రవితేజ, నాని, విశ్వక్‌సేన్‌, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ, అడవిశేష్‌.. వీళ్లంతా ఇక్కడ ఎదగడం లేదా? ఒక్క చిరంజీవి సక్సెస్… చాలా మందికి పరిశ్రమ వైపు అడుగులేసే ధైర్యాన్ని ఇచ్చింది..

అంతేకాదు.. ఈ సినిమా ఆడకపోతే… ఎవరికీ నచ్చకపోతే నేను సినిమాలే మానేస్తా’ అని ఛాలెంజ్ చేసాడు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాట కాదనిపిస్తుంది. తను పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు పలికించిన భావాలవి. ‘క’ ఆడినా, ఆడకపోయినా కిరణ్ హీరోగా సక్సెస్ అయ్యాడు. మంచి హీరోగా నిరూపించుకొన్నాడు. ఇక ఈ మూవీ హిట్ అవ్వకపోయిన పర్వాలేదు అని అనడం అందరిని ఎమోషనల్ అవ్వడంతో షాక్ అవుతున్నారు. ఇక అతనికి ఓ సినిమా వల్ల కలిగిన బాధ వల్ల ఇలా ఎమోషనల్ అయ్యాడని తెలుస్తుంది. కిరణ్ స్పీచ్ విని అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇక అతని ఎమోషనల్ స్పీచ్ విని ప్రేక్షకులు క మూవీని ఆదరిస్తారేమో చూడాలి.. ఇప్పటివరకు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక రేపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Bail To Actor Darsan: నటుడు దర్శన్ కి బెయిల్ మంజూరు.. బయటకు వచ్చాక చేసే మొదటి పని అదే..?

Jagapathi Babu: చిన్న కూతురికి అలాంటి సలహా.. షాక్ లో ఫ్యాన్స్..!

Salaar 2 Update : నిలిచిపోయిన సలార్ సీక్వెల్… ఫ్యాన్స్‌ను పిచ్చొళ్లను చేశారుగా…

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

×