EPAPER

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Clarity on the toxic shooting controversy.


Yash : తమిళ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కే జీఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. కే జీఎఫ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన సెకండ్ పార్ట్ కూడా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు టాక్సిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ కు మంత్రి షాక్ ఇచ్చారు.. తాజాగా ఆ వివాదం నుంచి బయట పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటరేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ హిందుస్థాన్ మెషిన్ టూల్స్ కెనరా బ్యాంక్‌కు విక్రయించినట్లు ఆరోపించిన అటవీ భూమిలో ఈ మూవీని సెట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికిందని వార్తలు మొన్నటి వరకు వినిపించ్చాయి . ఈ నేపథ్యంలో పీణ్యలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో చిత్ర టీమ్‌ని టార్గెట్ చేశారు మంత్రి. పీణ్య సమీపంలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ ప్రారంభించిన మూవీ టీమ్.. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారని,. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరం. ముఖ్యంగా అటవీ భూమిలో చెట్లను నరకడం శిక్షార్హమైన నేరం. ఈ నేపథ్యంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది.


ఇక ఇదిలా ఉండగా.. ఈ విషయం సంచలనంగా మారడంతో ఏకంగా మంత్రులు ఈ షూటింగ్ లొకేషన్ ను సందర్శించి క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సెట్‌ నిర్మాణం కోసం చెట్లను నరికిన చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అటవీశాఖ హెచ్చరించింది.. టాక్సిక్’ సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను అక్రమంగా నరికి ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ చట్టవ్యతిరేక చర్య శాటిలైట్ చిత్రాలను బట్టి స్పష్టంగా కనిపిస్తోందని, ఈరోజు ఆ స్థలాన్ని పూర్తిగా చెక్ చేశారు. తాజాగా ఈ కేసు నుంచి టాక్సిక్ మూవీకి ఊరట కలిగింది. అక్కడ శాటిలైట్ చిత్రాలను చూస్తే అక్కడ చెట్లు లేవని తెలిసిపోయింది. ఆ ఫోటోలను టీమ్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక టాక్సిక్ మూవీ విషయానికొస్తే.. త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

SSMB 29 Movie release date : రిలీజ్ డేట్ అయితే ఇదే… కానీ జక్కన్న గురించి తెలిసిందేగా..

SSMB29: మహేష్ బాబు రాజమౌళి సినిమా టార్గెట్ అన్ని కోట్లా.? రాజమౌళి కంటే మహేష్ కే ఎక్కువ

Vijay Dalapathi: ఆ రికార్డు సృష్టించనున్న విజయ్.. మొత్తం ఆస్తులు విలువ ఎంతంటే..?

Nishadh Yusuf : కంగువ ఎడిటర్ ఆకస్మిక మృతి

Kiran Abbavaram’s Ka Movie : కంటెంట్ ఏమో కానీ…. కన్నీళ్ళతో బజ్ బాగానే పెరిగింది..

Ka Movie Pre Release Event : కిరణ్ చెప్పిన మూవీ ఇదేనా… అంతలా ఏం ట్రోల్ చేశారు బ్రో..

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

×