పాములు ప్రత్యేక ప్రవర్తనను కలిగి ఉంటాయి. పుట్టుక నుంచి చావు వరకు కొన్ని యూనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి లక్షణాలలో ఒకటి ఒఫియోఫాగి లేదంటే ఇతర పాములను తినడం. ఈ లక్షణం కొన్ని పాము జాతులలలో ఉంటుంది. సొంత జాతి పాములతో పాటు ఇతర విష సర్పాలను వేటాడి వెంటాడి తింటాయి. కింగ్ కోబ్రా ఈ స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆహారం కోసం కింగ్ కోబ్రా జాతిలోని క్రైట్స్, కోబ్రాస్ తో సహా ఇతర విషపూరిత పాములను వేటాడుతుంది. ఈ పాములు ప్రధానంగా భారత్, సౌత్ చైనా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దాని విషం మనిషి క్షణాల్లో చనిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది.
కింగ్ కోబ్రా లాగే ఈస్ట్ కింగ్ స్నేక్..
కింగ్ కోబ్రా మాత్రమే కాదు, ఉత్తర అమెరికాలోని ఈస్ట్ కింగ్ స్నేక్ కూడా ఇతర పాములను వేటాడే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కింగ్ కోబ్రా మాదిరిగానే ఈస్ట్ కింగ్ స్నేక్ అత్యంత విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇతర పాములలోని విషాన్ని తట్టుకునే రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పాము ఎదుటి పాములను పట్టుకుని బలంగా చుట్ట చుట్టుతుంది. ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఒక్కసారి ఈ పాము చుట్టలో చిక్కుకునే పాము ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం ఉండదు. పాము చనిపోయిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
సొంత జాతులనే తినే పాములు
కింగ్ కోబ్రా, ఈస్ట్ కింగ్ స్నేక్ లాంటి కొన్ని పాములు ఇతర పాములను తినే లక్షణాన్ని కలిగి ఉంటే, మరికొన్ని పాములు సొంత జాతులనే తినే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఆఫ్రికన్ రాక్ కొండ చిలువ. ఆహరం కొరత, ఒత్తిడి, వివాదాల కారణంగా సొంత జాతి పాముల పైనే దాడి చేసి తినేస్తుంది. అయితే, సొంత జాతిలోని చిన్న పాములనే ఈ కొండ చిలువ తింటుంది. ఈ ఆఫ్రికన్ రాక్ కొండ చిలువ ఒక్కోటి సుమారు 20 అడుగుల వరకు పెరుగుతుంది. ఇంత భారీగా ఉండటం వల్లే ఇతర పాములపై దాడి చేసి ఈజీగా తినేస్తుంది. అయితే, తమకంటే పరిమాణంలో పెద్దగా ఉన్నవాటి జోలికి వెళ్లవు.
ఎందుకు తోటి పాములను ఎందుకు తింటాయంటే?
ఈ పాములు సరదా కోసం ఇతర పాములను తినవు. కొన్నిసార్లు ఆహారం కొరత ఉన్నప్పుడు, లేదంటే తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతర పాముల మీద దాడి చేసి చంపేస్తాయి. ఆ తర్వాత వాటిని తినేస్తాయి. బంధించబడిన పాములు, నివాసయోగ్యం కాని ప్రదేశంలో ఉన్న పాములు, ఎక్కువ సంఖ్యలో పాములు ఉన్న సమయంలోనే తోటి పాములను తినేందుకు మొగ్గు చూపుతాయని తాజా నివేదికలు వెల్లడించాయి. చిన్న జాతి పాములు కాకుండా, పెద్ద జాతి పాములలోనే ఇతర పాములను వేటాడే లక్షణం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
Read Also: పాముతో ముద్దులాట.. ఏకంగా కింగ్ కోబ్రాకే కిస్, ఆ తర్వాత ఏమైందంటే?