OTT Movies: సస్పెన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్డాగా ఓటీటీ సంస్థలు మారాయి.. కొత్త కంటెంట్ తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హారర్ సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు జనాలు కనెక్ట్ అవ్వడంతో ఓటీటీ సంస్థలు కూడా ఆలాంటి సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమా మాత్రం ఆణువణువునా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఆ మూవీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే సినిమాలు అరుదుగానే వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాయే కలి.. అక్టోబర్ 4న థియేటర్ల లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కేవలం రెండు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. అయితే ఇప్పుడు మరో ఓటీటీ లోకి కూడా ఈ మూవీ రాబోతోందని సమాచారం. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన నెలలోపే స్ట్రీమింగ్ కు రావడం పై మిశ్రమ టాక్ వినిపిస్తుంది.. అసలు ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కలి..ఇప్పుడీ అక్టోబర్ 31 నుంచి ఆహా వీడియో లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ‘మీరు భయాన్ని తట్టుకోగలరా? కలి మూవీ ప్రీమియర్ అక్టోబర్ 31న’ అనే క్యాప్షన్ తో ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక 4న థియేటర్ల లో రిలీజైన ఈ సినిమా.. అక్టోబర్ 17 నే ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరో రెండు వారాల తర్వాత ఇప్పుడు రెండో ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్ కు రానుండటం ఆలోచించాల్సిన విషయమే.. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆత్మ హత్య చేసుకోవాలనే ఒక వ్యక్తి జీవితంలోకి అపరిచిత వ్యక్తి వస్తే ఏం జరుగుతుంది.. అతడి జీవితం ఎలా మారుతుంది. ఆ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి జీవిత మారుతుందా అనేది ఈ సినిమాలో చూడొచ్చు..
ఇకపోతే ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కలి మూవీని నిర్మించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు.. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే తీసుకురావాలని భావించినా.. తర్వాత మనసు మార్చుకొని అక్టోబర్ 4న థియేటర్ల లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆహా ఆ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకు రాబోతుంది. మరి అక్కడ సినిమా ఎలా ఉంటుందో చూడాలి..