ఇండస్ట్రీలో ఆల్ రౌండర్‌గా పేరు దక్కించుకున్న రాఘవ లారెన్స్.. 1976 అక్టోబర్ 29న జన్మించారు.

రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్ అయిన ‘బుల్లెట్’, ‘కాళభైరవ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.

చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడి.. దాని నుండి బయటపడ్డారు లారెన్స్.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఒక కార్ క్లీనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు.

ఆర్థికంగా వెనకబడిన వారికోసం చదువు, మెడికల్ విషయాల్లో సాయం చేయడం కోసం చారిటబుల్ ట్రస్టులను ఏర్పాటు చేశారు.

తన చుట్టూ ఉండే పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలను బాగా నమ్ముతారు లారెన్స్. ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువే.

2010లో తిరుమల్లైవయల్‌లో ఒక రాఘవేంద్ర స్వామి బృందావన్ ఆలయాన్ని ప్రారంభించారు.

ముందుగా రజినీకాంతే లారెన్స్‌లోని డ్యాన్సర్‌ను గుర్తించి ఆయనను యూనియన్‌లో చేర్చారు.

తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా తనకు మొదటి అవకాశమిచ్చారు చిరంజీవి.

ఆ తర్వాత హీరోగా మారి హారర్ చిత్రాలతో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్.