Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ముందుగా మూడు టీమ్స్‌తో మొదలయ్యింది. ఆ తర్వాత అది రెండు టీమ్స్ అయ్యింది. ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత పాత కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్, కొత్త కంటెస్టెంట్స్ అంతా ఒక టీమ్ అయ్యారు. అయితే ఇకపై అలా టీమ్స్ ఉండవని, ఒక్కటే మెగా టీమ్ ఉంటుందని బిగ్ బాస్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆ మెగా టీమ్‌లో భాగమవ్వడం కోసమే ‘బీబీ ఇంటికి దారేది’ అనే పోటీ మొదలయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్స్‌గా విడిపోయారు. యెల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
నీటిని కాపాడుకోవాలి
‘‘తదుపరి ఛాలెంజ్ పానిపట్టు యుద్ధం’’ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. ఇందులో ప్రతీ టీమ్ నుండి ఇద్దరు సభ్యులు తమకు ఇచ్చి టాంక్‌లోని నీరు బయటికి పోకుండా చూసుకోవాలి. కానీ మిగతా టీమ్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్.. ఆ నీటిని బయటికి పంపించడానికి ప్రయత్నించాలి. అలా బ్లూ టీమ్ నుండి నిఖిల్, రెడ్ టీమ్ నుండి గౌతమ్, యెల్లో టీమ్ నుండి పృథ్వి, గ్రీన్ టీమ్ నుండి నబీల్.. ఇతర టీమ్ సభ్యుల టాంక్‌లోని నీటిని బయటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తుండగా.. మిగతా కంటెస్టెంట్స్ అంతా తమ తమ టాంక్‌లోని నీటిని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారు.
Also Read: బీబీ ఇంటికి దారేది.. కొత్త టాస్క్ తో మరో ఛాలెంజ్..!
లాగి పడేశాడు
‘‘ఎవరి టాంక్‌లో నీరు తక్కువగా ఉంటుందో వారు పోటీ నుండి తప్పుకోవాలి’’ అని క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. పృథ్వి.. ఎక్కువగా నిఖిల్ టీమ్‌నే టార్గెట్ చేశాడు. టాంక్‌కు సపోర్ట్‌గా స్టిక్కర్స్‌ను తీసేయడమే కాకుండా వాటిని దూరంగా పడేశాడు. బజర్ అయిపోయాక కూడా అలా చేయడం కరెక్ట్ కాదంటూ బ్లూ టీమ్‌లోని అవినాష్, నిఖిల్ తనపై సీరియస్ అయ్యారు. అసలైతే ఈ గేమ్‌లో కంటెస్టెంట్స్‌ను టచ్ చేయకూడదు. కానీ నిఖిల్ వెళ్లి రెడ్ టీమ్‌లోని ప్రేరణ, యష్మీలను లాగి పక్కన పడేశాడు. దీంతో అదే టీమ్‌లోని గౌతమ్‌తో తనకు గొడవ మొదలయ్యింది. ‘‘ఆపడం వేరు, టార్చర్ చేయడం వేరు’’ అంటూ అరిచాడు.
ఓవరాక్షన్ చేయకు
నిఖిల్ ప్రవర్తనకు యష్మీకి కూడా కోపం వచ్చింది. ‘‘సంచాలకుడిని గౌరవించాలి అని అరుస్తారు కానీ నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు. సంచాలకుడు ఆపమన్నప్పుడు ఆపాలి’’ అని అరిచింది యష్మీ. అయితే గౌతమ్‌కు చెప్పుకో అని రివర్స్ అయ్యాడు నిఖిల్. ‘‘చెయ్యి పట్టుకొని ఆపడం వేరు. లాగి, పీకి, తోసేయడం వేరు. సెన్స్ లేదా’’ అని నిఖిల్‌పై సీరియస్ అయ్యాడు గౌతమ్. నీకు ఉందా అని రివర్స్‌లో అడిగాడు నిఖిల్. ఆపిన పద్ధతి తప్పు అని గౌతమ్, ఆపడమే తప్పు అని నిఖిల్ వాదించుకున్నారు. ‘‘ఓవరాక్షన్ చేయకు’’ అని గౌతమ్‌తో అన్నాడు నిఖిల్. దీంతో గౌతమ్‌కు మరింత కోపమొచ్చింది. అవినాష్, పృథ్వి మధ్యలో వచ్చి ఆపేవరకు వీరి గొడవ ఆగలేదు.