Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఏకైక టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ మధ్యనే సీజన్ 4 మొదలయ్యింది. సీజన్ 4కు మొదటి గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ గావిచ్చేసి ఎన్నో కబుర్లు చెప్పారు. మరెన్నో విషయాలను, రహస్యాలను, ఎమోషన్స్ ను పంచుకున్నారు. ముఖ్యంగా సీజన్ 4 లో కూడా బాలయ్య ఎనర్జీ ఇసుమంతైనా తగ్గకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బావను ఆటపట్టిస్తూ ఆయన చేసిన చిలిపి పనులు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక మొదటి ఎపిసోడ్ ఘనవిజయాన్ని అందుకుంది. ఇక తాజాగా రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రెండో ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
” చెడ్డవాడు ఎగేసుకొచ్చినా.. ధైర్యంగా నిలబడాలి. కలబడాలి.. అలుపెరుగక సాగిపోవాలి” అనే పవర్ ఫుల్ పోలీస్ గెటప్ లో అంతే పవర్ ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇక దుల్కర్ ను ముందు పిలిచి ఆయనను ఒక ఆట ఆడుకున్నాడు. ఏంటి ఈ గ్లామర్.. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది అంటూ దుల్కర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు బాలయ్య. అనంతరం.. కుర్ర హీరోతో లవ్ బెలూన్స్ ను పగలకొట్టిస్తూ.. హీరోయిన్స్ నేమ్స్ చెప్తూ నవ్వులు పూయించాడు. దుల్కర్ ఒక ప్రశ్న అడుగుతాను అన్నా కూడా అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా నా టాక్ షోలో నేనే మాట్లాడాలి అంటూ మలయాళ హీరోను ఉక్కిరి బిక్కిరి చేశాడు.
Jai Hanuman: హనుమాన్ ను మించి జై హనుమాన్..మరో పాన్ ఇండియా హిట్ ఖాయం
ఇక దుల్కర్ కు కారులంటే ఇష్టం.. ఎంత స్పీడ్ లో వెళ్తావ్ అన్న ప్రశ్నకు.. 300 అని దుల్కర్ చెప్పగానే షాక్ అయ్యి.. మమ్ముట్టికి కొడుకు గురించి ఫిర్యాదు చేశాడు. మమ్ముట్టికి వీడియో కాల్ చేసి బాలయ్య మాట్లాడాడు. ఇక ఆ తరువాత డైరెక్టర్ వెంకీ అట్లూరిని పిలిచి ఆయనను కూడా వదిలిపెట్టలేదు. ఒక పెద్ద హిట్ వస్తే .. నాకు బిస్కెట్స్ పెట్టి పంపిస్తావ్ అని వెంకీకి సెటైర్ వేయగా.. ఆయన బిస్కెట్స్ పెట్టి పంపిస్తా సార్ అని చెప్పుకొచ్చాడు. బిస్కెట్స్ టీలోనే ముంచుకోవాలా అంటే.. నైట్ 9 అయితే మ్యాన్షన్ హౌస్ లో కూడా ముంచుకోవచ్చు సార్ అని పంచ్ విసిరి నవ్వులు తెప్పించాడు.
ఇక నిర్మాత నాగవంశీ వచ్చాకా షోనే కాదు.. ప్రోమో కూడా మారిపోయినట్లు కనిపిస్తుంది. బాలయ్య ఘాటు ప్రశ్నలు అన్ని నాగవంశీనే అడిగాడు. ఇంకా పనిచేయాలి.. పని చేయాలి అని ఎదురుచూస్తున్న హీరోయిన్ ఎవరు అని వెంకీని అడగ్గా.. నాగవంశీ కలుగజేసుకొని ఎప్పటినుంచో పూజా హెగ్డే మీద ఆయనకు కన్ను ఉంది అని చెప్పేశాడు. వెంటనే బాలయ్య.. మీ హైట్ ఏంటి, పూజా హెగ్డే ఏంటి అని అనగా.. నేను మ్యాచ్ చేసుకుంటా అని టక్కున వెంకీ చెప్పిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది. ఆ ఆన్సర్ కు బాలయ్య నేను హార్ట్ అయ్యాను అని మీనాక్షీని హాగ్ అడగుతూ నేను నీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.. కానీ, ఆమె మాత్రం థాంక్స్ అని చెప్పడంతో బాలయ్య నిరాశకు గురయ్యాడు.
Suriya: ఫ్యామిలీ విభేదాలు.. ముంబై షిఫ్ట్ అవ్వడానికి కారణం అదే..
త్రివిక్రమ్, సుకుమార్ వీరిలో ఎవరు మంచి రైటర్ అని నాగవంశీని అడిగాడు. దానికి ఆన్సర్ చెప్పలేదు కానీ.. ఎవరి బట్టలు చూసి చంపేస్తున్నాడురోయ్ బాబోయ్ అని అనిపించింది అని అడగ్గా.. నాగవంశీ ” దిల్ రాజు గారు అప్పుడప్పుడు పింక్ కలర్ ప్యాంట్ వేసుకుంటారు. అది ఇంకోసారి వేసుకోవద్దు అని చెప్పాలి” అని చెప్పుకొచ్చాడు. సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు.. కొంచెం తగ్గించుకొనే బావుండు అని ఏ హీరోతో అనగలం అన్న ప్రశ్నకు.. నాగవంశీ మాట్లాడుతూ.. ” నా మనసులో ఒక పేరు ఉంది. అది నేను బయటపెట్టలేకపోతున్నా.. మీరు బయటపెట్టారు. మీరు బాలకృష్ణ గారు కాబట్టి మీరు అనగలిగారు.. నేను చెప్పలేను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ హీరో ఎవరు అనేది పెద్ద చర్చగా మారింది. ప్రోమో మొత్తం నవ్వులతో నింపేశారు. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పేల్తాయ్….అన్నీ పేల్తాయ్!💥
Ee #Diwali Special #LuckyBaskhar tho mana #NBK!!🤩#Unstoppable season 4 ఇది బాలయ్య పండుగ..😀#Unstoppables4 with NBK Season 4, Episode 2 premieres on Oct 31, 7:00 PM.#DulqarSaalman #MeenakshiiChaudhary #NandamuriBalakrishna #JaiBalayya @dulQuer pic.twitter.com/cD7vYBf83Y— ahavideoin (@ahavideoIN) October 29, 2024