Dulquer Salmaan: మామూలుగా తమిళ హీరోలకు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారు నేరుగా తెలుగులో సినిమాలు చేసినా చేయకపోయినా వారికి తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గదు. ఇప్పుడు అదే లిస్ట్‌లోకి ఒక మలయాళ హీరో వచ్చి చేరాడు. తనే దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). కానీ ఈ హీరో రూటు కాస్త సెపరేటు. ఇతర భాషల్లో కూడా నేరుగా సినిమాలు చేస్తూ అన్నీ భాషా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు దుల్కర్. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మెగా హీరోను ఐస్ చేయడానికి సిద్ధపడ్డాడు దుల్కర్ సల్మాన్.
ఫేవరెట్ సినిమా
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రమే ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఒరిజినల్‌గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కడంతో ఇక్కడ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో తన ఫేవరెట్ తెలుగు హీరో గురించి, తెలుగు సినిమా గురించి బయటపెట్టాడు దుల్కర్ సల్మాన్. ‘‘నేను అల వైకుంఠపురంలో చూశాను. అది నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరు కాగా తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమానే తన ఫేవరెట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు దుల్కర్.
Also Read: స్టార్ హీరో సినిమాలో వేలు పెట్టిన మేనేజర్… పారితోషికం కోసం ప్రొడ్యూసర్ ను మార్చారా?
కూతురికి మాటిచ్చాను
‘‘నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్. తను ఒకసారి నాన్న నీకు అల్లు అర్జున్ తెలుసా అని అడిగింది. అప్పుడు నేనొక హీరోగా కాదు తన తండ్రిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది’’ అని అన్నాడు దుల్కర్ సల్మాన్. అల్లు అర్జున్‌ను ఎప్పటికైనా కలిసేలా చేస్తానని తన కూతురు మర్యంకు మాటిచ్చాడట. అంతే కాకుండా అల్లు అర్జున్‌కు తన ఫ్యామిలీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని బయటపెట్టాడు. దీంతో అల్లు అర్జున్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దుల్కర్ సల్మాన్ ఐస్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే దుల్కర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తనకు దొరికితే కచ్చితంగా తన సినిమాల కలెక్షన్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.
చాలామందికి క్రష్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’లో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటించింది. ముందుగా ‘మహానటి’ అనే సినిమాతో నేరుగా తెలుగులో అడుగుపెట్టాడు దుల్కర్. ఆ తర్వాత ‘సీతారామం’ చిత్రంలో నటించాడు. ఈ మూవీ తనను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. చాలామంది తెలుగమ్మాయిలు దుల్కర్ సల్మాన్‌ను క్రష్ లిస్ట్‌లో యాడ్ చేసేశారు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇప్పటికే అన్ని భాషల్లో సరిపడా ప్రమోషన్స్ చేశారు మేకర్స్.