SSMB29 Movie Update.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)చివరిగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram)దర్శకత్వంలో గుంటూరు కారం(Guntur karam)సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో తన 29వ సినిమా మొదలుపెట్టారు. మరోవైపు రాజమౌళి నుండి ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం ఫుల్లుగా జుట్టు, గడ్డం పెంచేసి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి తోడు ప్రత్యేకించి కొన్ని సన్నివేశాల కోసం శిక్షణ కూడా తీసుకున్నారు మహేష్ బాబు.
లొకేషన్స్ వేటలో పడ్డ రాజమౌళి..
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు. అంతేకాదు ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ అయినా కావాలని నెటిజన్స్ కోరుతున్నారు.ఇక ఎట్టకేలకు మహేష్ బాబు , రాజమౌళి మూవీ నుండి రాజమౌళి ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో లొకేషన్స్ వేటలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అడ్వెంచర్, యాక్షన్ డ్రామా మూవీ అని, అడవుల నేపథ్యంలో ఉంటుంది అని, ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని, గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు.
ఒక్క పోస్ట్ తో క్లారిటీ..
ఈ మేరకు తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కెన్యాలోని ఒక అడవి ప్రాంతంలో జంతువుల మధ్య తిరుగుతున్న ఫోటోని ఆయన షేర్ చేస్తూ వెతుకుతున్నాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి అయితే జీబ్రాల మధ్య రాజమౌళి వేట మొదలయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అడవుల్లో సాగే ఈ కథ ఎలా ఉండబోతోందో అని తెలిసి అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది షూటింగ్ మొదలు..
మరోవైపు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ చేసిన రోజే అడవి నేపథ్యంలో సినిమా ఉంటుందని చెప్పడంతో జంతువులు, అడవులు, అక్కడి నేషనల్ యానిమల్స్ పార్క్ పరిశీలించి షూటింగ్ కి తగిన ప్రదేశాలను వెతికే పనిలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళి ఒక్క పోస్ట్ తో సినిమా వర్క్ ఫాస్ట్ గానే జరుగుతుందని చెప్పేశారు. లొకేషన్స్ ఫైనల్ అయితే త్వరలోనే షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది అని, దీంతో వచ్చే సంవత్సరం మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram