BB Telugu 8 Promo: తాజాగా బిగ్ బాస్ 58వ రోజుకు సంబంధించి నిర్వహకులు ప్రోమోని విడుదల చేశారు. ఇందులో బిగ్ బాస్ ఇంటికి దారేది అంటూ ఒక కొత్త టాస్క్ ను నిర్వహించారు. మరి ఈ ఛాలెంజ్ తో కంటెస్టెంట్స్ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అసలు ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో ఏముంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తాజా ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం 3 క్లాన్స్ గా మొదలైంది. అయితే ఇప్పటి నుండి ఉండబోయేది ఒకే ఒక మెగా క్లాన్. అదే బీబీ క్లాన్. అంటూ తెలిపారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా సంబరపడిపోయారు. ఇక ముగ్గురిని ఒక టీం చొప్పున డివైడ్ చేసి, వారికి ఒక టాస్క్ ఇచ్చారు. అదే బిగ్ బాస్ ఇంటికి దారేది. ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మీ ముందున్న పార్ట్స్ ను ఉపయోగించి, మీ టీం కి సంబంధించిన స్నోమాన్ ని ముందుగా పూర్తి చేయడమే అంటూ టాస్క్ నిర్వహించారు.
అందులో నిఖిల్, హరితేజ , ముక్కు అవినాష్ బ్లూ టీమ్, యష్మీ, ప్రేరణ, గౌతమ్ రెడ్ టీమ్, పృథ్వీ , నయని పావని ,రోహిణి ఎల్లో టీం, టేస్టీ తేజ , నబీల్ , విష్ణుప్రియ గ్రీన్ టీం గా విభజించారు బిగ్ బాస్. సంచాలక్ గా గంగవ్వ వ్యవహరించారు. ఇక చివరిగా ఎవరికి వారు ఆట రసవత్తరంగానే పూర్తి చేశారు. ఇక ఆటలో భాగంగా టేస్టీ తేజ కింద పడిపోయారు.. ఆ తర్వాత హరితేజ బ్లూ టీం గెలిచింది. ఆ తర్వాత హరితేజ టీం తో మాట్లాడుతూ.. హరితేజ స్టోర్ రూమ్ లో ఉన్న ఎల్లో కార్డును తీసుకొచ్చి ఏ టీం కి ఇవ్వాలని అనుకుంటున్నారో వారికి ఇచ్చేయండి అంటూ తెలిపారు బిగ్ బాస్. హరితేజ తన పక్కన నిలబడి ఉన్న గ్రీన్ టీం ను దాటుకొని ముందుకు సాగుతూ వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఉన్న ఎల్లో టీమ్ , రెడ్ టీమ్ లలో ఎవరికి ఇచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త చాలా వైరల్ గా మారుతోంది.
ఇకపోతే ఈ ప్రోమో ఈరోజు రాత్రి 9:30 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఇకపోతే నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయ్యారు అని అందరూ అనుకున్నారు. ఆయన అనారోగ్య సమస్యల కారణంగానే హౌస్ నుంచి వెళ్లిపోయారంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మళ్ళీ హౌస్ లో కనిపించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఏదేమైనా ముక్కు అవినాష్ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడంతో షో కి క్రేజ్ మరింత పెరిగిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే ప్రస్తుతం ఎనిమిదవ వారం సాగుతున్న నేపథ్యంలో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా ముగిసింది. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.