EPAPER

Ka Movie Climax : క్లైమాక్స్‌‌లో కన్నీళ్లు… సాడ్‌గా ఎండ్ అయ్యే స్టోరీ..?

Ka Movie Climax : క్లైమాక్స్‌‌లో కన్నీళ్లు… సాడ్‌గా ఎండ్ అయ్యే స్టోరీ..?

Ka Movie Climax : ఈ ఏడాది దీపావళికి బాక్స్ ఆఫీస్ బరిలో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అందులో తెలుగు నుంచి దీపావళి కానుకగా రాబోతున్న సినిమా ‘క’ (Ka Movie). ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం పదండి.


టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నయన్ సారిక, తన్వి రామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘క’ (Ka Movie). దర్శక ద్వయం సందీప్, సుజిత్ కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. ఈనెల 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రచారం చేస్తున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ప్రమోషన్ల బాధ్యతను కేవలం తనొక్కడే భుజాలపై ఎత్తుకొని ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు అంటూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ మూవీ పై మంచి బజ్ ఏర్పడింది. కానీ దీపావళి కానుకగా మరో రెండు మూడు సినిమాలు రాబోతుండడంతో అసలు కిరణ్ అబ్బవరం సినిమా ఎంత మేరకు థియేటర్లకు జనాలను రాబడుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లో కృష్ణగిరి అనే ఊరిలో 1977లో పోస్ట్ మాన్ గా పని చేస్తాడు అభినయ వాసుదేవ్. ఆ ఊర్లో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడుతుంది. ఇలాంటి వింత ఊర్లో ఓ లెటర్ ఎంత కల్లోలం సృష్టిస్తుంది. అజ్ఞాత వ్యక్తి ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవడానికి చేసే బీభత్సం, అతని నుంచి ఊరిని కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలను విజువల్ వండర్ గా చూపించారు మేకర్స్.


అయితే రీసెంట్ గా ప్రమోషన్లలో కిరణ్ అబ్బవరం సినిమాలో 20 నిమిషాల పాటు ఉండే క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది అంటూ హైప్ పెంచారు. తాజా సమాచారం ప్రకారం ఆ క్లైమాక్స్ లో సాడ్ ఎండింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. సాధారణంగా క్లైమాక్స్ లో సాడ్ ఎండింగ్ ఉండడం అనేది తమిళ తంబీలకు ఎక్కువగా నచ్చే యవ్వారం. మన తెలుగు ఆడియన్స్ కి మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటేనే హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటిదాకా ఇలా సాడ్ ఎండింగ్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటం చూసాం మనం. అసలే కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి (Ka Movie)తో థియేటర్లలోకి రావడం అనేది అతిపెద్ద సాహసం అనుకుంటే ఇప్పుడు వినిపిస్తున్న రూమర్లు చూసి షాక్ అవుతున్నారు సినీ ప్రియులు. మరి ఈ కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్ సినిమాకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చూడాలి.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×