EPAPER

Ka Movie Bookings : ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు… కేవలం నాలుగు థియేటర్స్ మాత్రమే..?

Ka Movie Bookings : ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు… కేవలం నాలుగు థియేటర్స్ మాత్రమే..?

Ka Movie Bookings : లక్కీ భాస్కర్, అమరన్‌తో పాటు కేజీఎఫ్‌తో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ కథ అందించిన భగీర మూవీ కూడా ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు పోటీలో ఉన్నా… యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ‘క’ మూవీని పోటీలో దింపుతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ కాబట్టి, పాన్ ఇండియా వైడ్ ఆదారణ ఉంటుందని అనుకుంటున్నారు మేకర్స్. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో రోజే ఓ పెద్ద ఎదురుదెబ్బ తగలబోతుంది ‘క’ మూవీకి. అది ఏంటి..? కిరణ్ అబ్బవరం మూవీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు చూద్ధాం..


‘క’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మేకర్స్ ఎదురవుతున్న క్వశ్చన్స్‌లో ఎక్కువగా వినిపించింది… నాగ వంశీ నిర్మించిన లక్కీ భాస్కర్, దేశ భక్తి కథతో వస్తున్న అమరన్, ప్రశాంత్ నీల్ కథ అందించిన భగీర మూవీలకు పోటీగా వెళ్తే… థియేటర్స్ దొరుకుతాయా..?

ఈ క్వశ్చన్ కు మూవీ టీం నుంచి వచ్చే ఆన్సర్… కథ. తమ మూవీ కథ అందరూ ఆదరించేలా ఉంటుందని నమ్ముతున్నారు. కానీ, విషయం ఏంటంటే… తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్‌పై ఎక్కువ పట్టు ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు తర్వాత నాగ వంశీనే. ఆయన నిర్మిస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది అంటే… తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు థియేటర్స్ నాగ వంశీకే వెళ్తాయనేది అందరికీ తెలిసిన సత్యం. అంతే కాదు, దిల్ రాజు – నాగ వంవీ మధ్య ఉన్న బాండింగ్ వల్ల ఆ సంఖ్య పెరుగుతుంది కూడా.


ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘క’ మూవీ టీం పోటీకి రెడీ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కథ మీద అంత నమ్మకం ఉంటే, సోలో రిలీజ్ కి ట్రై చేస్తే హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరం కు మంచి జరిగేది అని కూడా చర్చ జరిగింది. ఏది ఏమైనా, ‘క’ మూవీ ఈ సినిమాలకు పోటీగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ అవుతుంది.

కేవలం నాలుగు థియేటర్స్ మాత్రమే…

‘క’ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ అక్టోబర్ 30న పడుతున్నాయి. ఆ రోజు ఈ మూవీకి కేవలం మూడు థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ఈ మూవీ 31న రిలీజ్ అవుతుంది. ఆ రోజు… సినిమా కేవలం 16 థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతుంది. (ఇప్పటి వరకు వచ్చిన సమాచారం). ఇక నవంబర్ 1న ‘క’ మూవీకి వచ్చిన థియేటర్స్ జస్ట్ నాలుగు మాత్రమే.

తర్వాత తేదీల్లో కూడా ప్రస్తుతం నాలుగు థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగు థియేటర్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా..? అనేది ఇప్పుడు మేకర్స్ ను కలవరపెడుతుంది.

అయితే, సినిమా టాక్ బాగుంటే, ఈ నాలుగు థియేటర్స్ సంఖ్య పెరగొచ్చు. నిజానికి మేకర్స్ దాన్నే నమ్ముకున్నారు. కథ బాగుందని ప్రతీ వేదికపై చెబుతున్నారు. మేకర్స్ చెప్పినట్టు కథ బాగుంటే, ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే థియేటర్స్ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ టచ్ చేయడానికి వీలు ఉంటుంది.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×