Ka Movie Heroine : ఇండస్ట్రీలో హిట్స్ లేకున్నా హీరోగా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. కానీ, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం హిట్ లేకుండా ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతూ… వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక్క హిట్ అంటూ కళ్లు కాయాలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఆ హిట్ అందుకునే టైం వచ్చేసింది అంటూ ‘క’ అనే మూవీపై హోప్స్ పెట్టుకుంటున్నాడు ఆయన. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అందులో హీరోయిన్స్ సమస్య ప్రధానం గా కనిపిస్తుంది. ఈ ఇష్యూ ఏంటో ఇప్పుడు చూద్ధాం..
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలని చూస్తున్న నటుడు. 2019 నుంచి ఇప్పటి వరకు వరుస పెట్టి 8 సినిమాలను రిలీజ్ చేశాడు. మరి కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా ‘క’ అనే మూవీని రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఐదేళ్ల కెరీర్‌లో కిరణ్ కు కాస్త కూస్తో చెప్పుకోదగ్గ మూవీస్ అంటే ఎస్ ఆర్ కళ్యాణమండపం. అలాగే వినరో భాగ్యము విష్ణు కథ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితేే ఇండస్ట్రీలో నిలబడాలంటే.. ఇది సరిపోదు. అందుకే పాన్ ఇండియా మూవీ అంటూ ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
హీరోయిన్స్‌కి ఏం అయింది..?
పాన్ ఇండియా సబ్జెక్ట్ అంటూ ‘క’ మూవీకి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తన్వీ రామ్ అనే మలయాళ నటితో పాటు నయన్ సారిక కూడా ఫీమేల్ లీడ్ చేస్తుంది. అయితే షూటింగ్ వరకు ఈ ఇద్దరు హీరోయిన్స్ బాగానే కనిపించారు. కానీ, ఇప్పుడు ప్రమోషన్స్ వరకు వచ్చే సరికి ఎక్కడా చూసిన హీరో కిరణ్ అబ్బవరం మాత్రమే కనిపిస్తున్నాడు. ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ తో పాటు చాలా వరకు ప్రమోషన్స్ ఈవెంట్స్ చేస్తున్నారు. కానీ, ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో హీరోయిన్స్ కి ఏం అయింది..? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతుంది. రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా.. ఈ హీరోయిన్స్ వస్తారో రారో చూడాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా నాగ చైతన్య..
ఈ ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని The Westin లో జరగనుంది. అయితే ఈ ఈవెంట్‌కు నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. అలాగే నాగ చైతన్య హీరోగా చేస్తున్న థండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి కూడా రాబోతున్నట్టు టాక్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై ఇంకా బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుందని, చూడదగ్గ మూవీ అని ఆడియన్స్ లో ఓ అవగాహన వచ్చింది. కానీ, లక్కీ భాస్కర్, అమరన్ లాంటి సినిమాలను పక్కన పెట్టి ఈ మూవీకి వచ్చే ఛాన్స్ ఉందా…? అనేది చూడాలి.