Raviteja – Balakrishna.. సాధారణంగా హీరోలు లేదా దర్శకుల మధ్య మనస్పర్ధలు, విభేదాలు సహజమే. అయితే ఎదురుపడితే చక్కగా మాట్లాడుకుంటారు కూడా.. మనసులో ఏమున్నప్పటికీ అది వారు బయటకి ప్రదర్శించారు. కారణం మీడియా చూస్తుందన్న భయం. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం అసహనం వ్యక్తపరిచినా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. దీనికి తోడు ఎన్నో సమాధానాలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాగే రవితేజ (Raviteja ), బాలకృష్ణ(Balakrishna ) మధ్య గొడవలు ఉన్నాయి అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రవితేజను బాలకృష్ణ కొట్టాడని, ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో రవితేజ మాట్లాడడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా రవితేజ హీరోగా ఎదుగుతున్న రోజుల్లో జరిగిందని సమాచారం.
బాలకృష్ణ – రవితేజ మధ్య గొడవలు..
మరి అసలు విషయం ఏమిటి అనే విషయానికొస్తే.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి రవితేజ గెస్ట్ గా వచ్చారు. ఈ షో వేదికగా మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, అవన్నీ పుకార్లు మాత్రమే అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే అన్ స్టాపబుల్ షో కి డైరెక్టర్ గా ఉన్న బీవీఎస్ రవి (BVS Ravi)ని ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడగగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీవీఎస్ రవి మాట్లాడుతూ.. రవితేజతో గత 20 సంవత్సరాలుగా నాకు మంచి అనుబంధం ఉంది. ప్రతిరోజు కనీసం రెండు గంటలైనా ఆయనతో ఫోన్ మాట్లాడే అంత చనువు ఉంది. నాకే వారి గొడవ విషయం తెలియలేదంటే, ఇది అక్షరాలా అబద్ధం. వజ్రోత్సవ వేడుకలలో రవితేజ, బాలకృష్ణ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు కూడా.. ఒకసారి షూటింగ్ కోసం ఇద్దరూ యూరప్ వెళ్లగా ఫ్లైట్లో కూడా వారు కలుసుకొని మాట్లాడుకున్నారు. అలాగే చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో కూడా బాలకృష్ణ, రవితేజ పాల్గొన్నారు. బాలకృష్ణ డాన్స్ చేయగా.. రవితేజ జోకులతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటే.. ఎవరు నమ్మరు.. ఎవరో కావాలనే రూమర్స్ సృష్టించారు అంటూ బీ.వీ.ఎస్. రవి తెలిపారు.
వారిద్దరి మధ్య విభేదాలపై బీ.వీ.ఎస్.రవి క్లారిటీ..
ఇక బీ.వీ.ఎస్.రవి మరో మారు మాట్లాడుతూ.. అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రవితేజని అనుకుంటున్నాం.. అనగానే బాలయ్య సరే పిలవండి అన్నారు. ఇదే విషయం నేను రవితేజకు చెబితే బాలయ్య పిలిస్తే రాకుండా ఉంటాను అని కూడా అన్నారు. అయితే టైట్ షెడ్యూల్స్ కారణంగా డేట్ ఎప్పుడు అనేది నేను చెబుతాను. ఆ వెసులు బాటు నాకు ఇవ్వండి అని రవితేజ తెలిపారు. రవితేజ స్టూడియోలోకి రాగానే హాయ్ రవితేజ గారు అని బాలకృష్ణ పలకరిస్తే.. గారు ఏంటండీ.. రవి అని పిలవండి అన్నారు. ఇలా వీరిద్దరూ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ముగిశాక కలిసి భోజనం కూడా చేశారు. నిజానికి వారిద్దరి మధ్య ఎటువంటి రూమర్స్ లేవు.. కావాలనే రూమర్స్ సృష్టిస్తున్నారు అంటూ బీ.వీ.ఎస్.రవి తెలిపారు.