EPAPER

Intinti Ramayanam Today Episode : అవని గిఫ్ట్ ను రిజెక్ట్ చేసిన అక్షయ్.. పల్లవికి షాకివ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode : అవని గిఫ్ట్ ను రిజెక్ట్ చేసిన అక్షయ్.. పల్లవికి షాకివ్వబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode October 29th : గత ఎపిసోడ్ లో.. అవని తన గదిలోకి వెళ్లి ఫంక్షన్ కి రెడీ అవ్వాలని ఒక చీరను తీసి పక్కన పెడుతుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వస్తాడు. మీరు నాకోసం తీసుకొచ్చిన చీరనే నేను కట్టుకుంటాను అనేసి అక్షయతో అవని అంటుంది. దానికి అక్షయ్ ఆ చీరను నీకు ఇవ్వమని చెప్పాను కదా అంటాడు. ఇది నా కోసం తీసుకొచ్చిన చీర మీరు నాకు ఇవ్వడమేంటి ఈ చీర నేను ఇవ్వను అనేసి కాసేపు ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. ఇక అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతా డు. చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకున్న అవని వాళ్ళతో మాట్లాడుతుంది. పల్లవిని చూసిన రాజేశ్వరి పల్లవికి క్లాస్ పీకుతుంది. ఇక పల్లవి అవనికి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ తన భార్యతో కలిసి పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకుంటారు. పంతులుగారు వచ్చి వారికి దండలు మార్పించి, అలాగే ఉంగరాలను కూడా పెట్టిస్తాడు. ఇక పంతులు పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని, చిన్నవారికి మీ ఆశీస్సులు తెలపండి అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాజేంద్రప్రసాద్ తన తల్లి దగ్గర భార్యతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. మిగిలిన జంటలందరూ తమ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మృణాళిని గుమ్మడికాయని దిష్టి తీసి ప్రణవికిస్తుంది. ప్రణవి దాన్ని బయటపడేయాలని బయటకు తీసుకొస్తుంది. అప్పుడే ఒకతను ఆటో నుంచి దిగుతాడు. ఇంటి బయటకు రాగానే పల్లవికి ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నానని చెప్పి చెప్తాడు. నువ్వు అక్కడే ఉండు నేను వస్తున్నా అని పల్లవి అంటుంది. అప్పుడే ప్రణవి గుమ్మడికాయ తీసుకొచ్చి అతని కాళ్ళ మీద వేస్తుంది. చూసుకోలేదని సారీ చెప్పిన కూడా అతను వినడు. ఇద్దరి మధ్య గొడవ ఏర్పడుతుంది. కాసేపు ఇద్దరు గొడవపడతారు.

అసలు నువ్వు ఎవ్వడు రా మా ఇంటికి వచ్చిన అన్ని అంటున్నావ్ అని ప్రణవి అతనితో వాదనకు దిగుతుంది . అసలు నిన్ను ఎవరు పిలిచారు చెప్పు అనేసి అడిగితే అప్పుడు పల్లవి పేరు చెప్పబోతాడు అంతలోకే పల్లవి వస్తుంది. ఏమైంది ప్రణవి అనేసి అడుగుతుంది అక్కడ జరిగిన విషయం ప్రణవి పల్లవితో చెప్తుంది పల్లవి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను అనేసి అంటుంది . ప్రణవి వెళ్ళగానే అతన్ని పల్లవి తిడుతుంది ఎవర్ రమ్మన్నారు అంటే నా పేరు చెప్తావ్ ఏంటి అంటూ అరుస్తుంది. సరే మేడం ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు అంటే రా వెళ్దాం అని లోపలికి తీసుకెళ్తుంది . అక్కడ చక్రధర్ పల్లవి ఇద్దరు కలిసి అతనికి ఏం చేయాలనీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక అతను గెస్ట్ లాగా ఇంట్లో అటు ఇటు తిరుగుతాడు. ప్రణవి అందరికీ జ్యూస్ ఇస్తుంది. అతని దగ్గరకు రాగానే అతని చూసి జ్యూస్ ఇవ్వకుండా పక్కకు వెళుతుంది. అది చూసిన అవని తప్పు ప్రణవి అని అతనికి జ్యూస్ ఇస్తుంది. కక్కుర్తి పడి ఒకటికి నాలుగు జ్యూసులు తాగుతాడు. కడుపులో ఏదో తేడాగుందని బాత్రూం వెళ్తాడు. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.


అప్పుడు అతను బ్యాగు పట్టుకుని వస్తాడు. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని పల్లవి సైగలు చేస్తుంది. అతను కావాలనే కింద పడినట్టు నటిస్తాడు. అతను తీసుకొచ్చిన బ్యాగ్ లోంచి నగలు బయటపడతాయి. అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఈ నగలు ఏంటి అని అందరూ అడుగుతారు .దానికి అతను నేను అవని బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. అవన్నీ నాకు డబ్బులు అవసరం అంటే నగలు ఇచ్చింది. ఆ నగలను నేను తాకట్టు పెట్టుకొని నా అవసరం తీరాక నగలను తీసుకొచ్చాను అని చెప్తాడు . ఆ మాట వినగానే అక్షయ్ నాలుగు పీకుతాడు. ఇక రాజేంద్రప్రసాద్ కూడా నా కోడలు ఎప్పుడూ అబద్ధం చెప్పదనేసి అందరు ముందు రోజు చెప్తాడు. ఇక కమ్మలు కూడా ఏంటి గిల్టువి ఒరిజినల్ అని ఏదో అబద్దాలు చెప్తున్నావ్ మా వదిన గురించి అంటావ్ అని నాలుగు పీకుతాడు. ఇక అవని కూడా నేను నీకు నగలు ఇచ్చానా అసలు నువ్వు ఎవర్రా నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నావని పీకుతుంది. ఇక పల్లవి ఆపే ప్రయత్నం చేస్తుంది. పల్లవి మాట వినకుండా అవని ఇంకా నాలుగు పీకుతుంది. అక్క అతను చెప్పేది నిజమో కాదో అందరికీ డౌటే ఉంది. అయితే నీ నగలు ఒరిజినల్ కాదని తెలిస్తే సరిపోతుంది. కదా అతను చెప్పింది అబద్ధమని తేలిపోతుంది కదా అతన్ని అప్పుడు బొంద పెట్టి పాతేయ్యొచ్చు అని అంటుంది.. అవని షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో నగలు ఒరిజినలా కాదా అని చెప్పబోతున్నారు. మరి అవని చెప్పింది నిజమా అబద్దమా అని రేపు తెలియనుంది..

Related News

GundeNinda GudiGantalu Today Episode : సత్యం ఆరోగ్య పరిస్థితి విషమం.. మీనాకు దగ్గరవుతున్న బాలు.

Satyabhama Today Episode : సంజయ్ కు సత్య వార్నింగ్.. సత్య, క్రిష్ రొమాంటిక్ డ్యాన్స్..

Brahmamudi Serial Today October 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  కావ్య కష్టం అంతా వృథా – బిజినెస్‌ కోసం ఎవరూ ముందుకు రాని వైనం – కామెడీగా తీసిపారేసిన రాజ్‌

Trinayani Serial Today October 29th: ‘త్రినయని’ సీరియల్‌: బొమ్మలో బాంబు పెట్టిన తిలొత్తమ్మ – పాప గురించి ఇంట్లో వాళ్లకు ముందే తెలుసన్న అహల్య 

Nindu Noorella Saavasam Serial Today October 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుప్తకు శక్తులు ఇచ్చిన దేవుడు – ముత్తైదువుల రాకతో మిస్సమ్మ పూజ సక్సెస్‌  

Intinti Ramayanam Today Episode : ఇంట్లో గ్రాండ్ గా పెళ్లిరోజు వేడుకలు.. అవనికి పల్లవి వల్ల ఘోర అవమానం..

×