Suriya in recent interview : ఈ రోజుల్లో ఒక సినిమా హిట్టు ప్లాప్ కి ఉన్న డెఫినిషన్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా హిట్ కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయించేవాళ్లు. అప్పట్లో చాలా సినిమాలు 50 రోజులు వంద రోజులు ఆడుతూ ఉండేవి. అయితే ఒక సినిమా ఎన్ని సెంటర్లో ఎన్ని రోజులు ఆడింది అనేది ఒకప్పుడు సినిమా హిట్ కు కొలమానంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కలెక్షన్స్ కూడా ఫేక్ కలెక్షన్స్ వేయడం మొదలుపెట్టారు. కలెక్షన్స్ అనేవి కేవలం పోస్టర్ కు మాత్రమే పరిమితం. ఇదే విషయాన్ని నిర్మాత నాగ వంశీ (Naga vamsi) కూడా పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసమే కలెక్షన్స్ పోస్టర్ మీద వేస్తాము అంటూ ఆన్ స్టేజ్ చెప్పాడు. నాగ వంశీ మెయిన్ బ్యానర్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమా కలెక్షన్స్ మాత్రం 200 కోట్లకు పైగా వచ్చాయి. అలానే నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేసిన దేవర సినిమాకి కూడా నెగిటివ్ గా వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ దాదాపు 500 కోట్ల వరకు చేరిపోయాయి.
Also Read : Suriya : సత్యం సుందరం సినిమాకి నాకు 25% ప్రాఫిట్స్ వచ్చాయి
అయితే వీటి పైన రీసెంట్ ఇంటర్వ్యూస్ లో హీరో సూర్య (Suriya) స్పందించారు. ఇప్పుడు అంతా కలెక్షన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు ఈ కల్చర్ అనేది పోవాలి. 12, 13 ఏళ్లున్న స్కూల్ పిల్లలు కూడా మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది మీ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటూ ఆర్గ్యుమెంట్స్ చేయటం మొదలుపెట్టారు. వీటన్నిటినీ పక్కనపెట్టి ఆర్ట్ గురించి క్రాఫ్ట్ గురించి మాట్లాడే కల్చర్ రావాలి. దీనిని ఎవరో ఒకరు మొదలు పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. సూర్య ఆఫ్ స్టేజ్ లో ఇలాంటి విషయాలు చెప్పడమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సందేశాత్మకమైన సినిమాలను చేస్తూ ఉంటారు. అలానే నిర్మాతగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. అందుకనే భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు సూర్యను విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు.
Also Read : NBK 109 Movie Title : డాకు మహారాజు ను పక్కన పెట్టి ఈ టైటిల్ పై కన్నేసిన టీం… ఆల్మోస్ట్ ఫిక్స్ ?
ఇక ప్రస్తుతం శివ (Siva) దర్శకత్వంలో సూర్య కంగువ (Kanguva) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని బాహుబలి సినిమా ఏ స్థాయిలో నిలబెట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిందో, అదే స్థాయిలో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీని కంగువ సినిమా నిలబెడుతోంది అని చాలామంది అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని చెబుతూ వచ్చాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచింది.