Gundeninda GudiGantalu Today Episode 29th : గత ఎపిసోడ్ లో.. మీనా చనిపోయిందేమో అని తెలుసు కోవాలని బాలు రాజేష్ తాగి మీనా పుట్టింటికి వెళ్తాడు. అక్కడ మీనా బ్రతికే ఉందని తెలుసుకొని వెళ్లిపోతారు. ఇక తాగేసి రాజేష్, బాలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక బాలు తాగి ఇంటికి వస్తాడు. అది చూసిన సత్యం షాక్ అవుతాడు.. ఏంటి తాగేసి వచ్చావా అని అంటాడు. దానికి రవిని కొట్టి బాధతో తాగేసి వచ్చానని చెప్తాడు. దానికి ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది.. దానికి సత్యం కు మాసీవ్ హర్ట్ ఏటాక్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు వెంటనే హాస్పిటల్ కు తీసుకొని వస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం కు హార్ట్ ఏటాక్ రావడంతో హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డాక్టర్ ఏమి చెప్తాడా అని టెన్షన్ పడతారు. కానీ బాలు మాత్రం తన తండ్రికి ఇలా అయిందని బాధ పడతాడు. తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఏడుస్తాడు. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి మాసీవ్ హార్ట్ ఏటాక్ వచ్చిందని చెబుతాడు. అయితే డాక్టర్ ఆయన కండిషన్ గురించి ఇప్పుడే మేము ఏమి చెప్పలేము అంటారు. ఆయనకు కొన్ని టెస్టులు చేసాము అవి వచ్చాక చెబుతాము.. గుండెకు సంబందించిన ఒక సీనియర్ డాక్టర్ ను రమ్మని చెప్పాము. ఆయన వచ్చి చూసి ఏమి జరిగిందో చెబుతామని అంటాడు. ఆయనను తొందరగా పిలిపించండి అని అంటారు..
ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడికి డబ్బులు ఇస్తుంటే నా దగ్గర ఉన్న అమ్మ నువ్వు ఇచ్చినవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నా అని చెప్తాడు. ఇప్పుడు కదరా నీకు ఇచ్చిందని డౌట్ పడుతుంది. ఇక మీనా పూల సంచిని తీసుకొని బయలుదేరాలనుకుంటుంది. అప్పుడు పార్వతి నువ్వు ఎక్కడికి వద్దు నువ్వు ఇంటి దగ్గరే ఉండు నీకోసం అల్లుడుగారు రావచ్చు అనేసి అంటుంది. నువ్వు కలగంటున్నావా అమ్మ ఆయనకు నా మీద కోపము నేను ఏదైనా చేసుకున్నానని ఆలోచించాడే తప్ప నా కోసం రాడమ్మ నువ్వు ఆశలు పెట్టుకోకు అని మీనా పార్వతితో అంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే ఇష్టం అనేది ఉంటే ఎవరైనా రావాల్సిందే అనేసి పార్వతి అంటుంది. మంచిదే నువ్వు ఇంటి దగ్గరే ఉండు అల్లుడుగారు వస్తే అల్లుడు గారితో ఇంటికి వెళ్ళు అనేసి పార్వతి గుడికి వెళుతుంది. ఇక సుమతి బావతో నేను నిజం చెప్పనా అమ్మ అని పార్వతితో అడుగుతుంది. నోరు మూసుకొని పూలదండల ఆర్డర్ వచ్చింది అవి కట్టేసి నువ్వు కాలేజీకి వెళ్లి పార్వతి అంటుంది. ఇది పెద్ద వాళ్ళ దాంట్లో దూరడమే పని అయిపోయింది ఈ మధ్య లేనిపోని గొడవలు తెచ్చి పెడుతున్నామని పార్వతి సుమతిని తిడుతుంది.
ఇక మీనా మావయ్యకు ఎలాగైనా నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మామయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తూ మౌనిక కి ఫోన్ చేస్తుంది. మీనాతో ఫోన్ మాట్లాడుతుంది. రవి నన్ను అడ్డంగా ఇరికించాడు శృతిని పెళ్లి వద్దని చెప్పడానికి మాట్లాడాలని తీసుకెళ్లి నా మెడకు చుట్టేసాడని మౌనికతో మీనా చెప్తుంది. మావయ్య గారు ఎక్కడున్నారు తెలుసుకోవాలని నీకు ఫోన్ చేశాను మౌనిక మావయ్య గారు ఎక్కడున్నారు. యూనియన్ ఆఫీస్ కి వెళ్తారు కదా అక్కడికి వెళ్లి నేను మాట్లాడతానని మీనా అంటుంది. వదిన నీకు ఈ విషయం తెలీదా అనగానే మీనా ఏమైంది మౌనిక మామయ్యకు ఏదైనా జరిగిందా అనేసి అడుగుతుంది. నాన్నకు నిన్న రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చింది వదిన.. హాస్పిటల్లో హాస్పిటల్ అడ్రస్ ను కనుక్కుంటుంది మీనా..
డాక్టర్ వచ్చారని చెప్పాడు మరి ఈ డాక్టర్ ఏం చెప్పాడు ఏం చెప్పట్లేదు అసలు నాన్నకు ఎలా ఉందో నేను ఇప్పుడే తెలుసుకుంటానని లోపలికి వెళ్తాడు బాలు. బాలు లోపలికి వెళ్ళగానే మీనా వస్తుంది. మామయ్యను ఒకసారి చూడాల అత్తయ్య మామయ్యకి ఇలా అయిందని నా మనసు ఏదో లా ఉంది చూడాలని నేను వచ్చాను ఒక్కసారి చూస్తే క్షమించమని కోరుకుంటాను అనేసి మీనా ప్రభావతిని ఎంతగా బ్రతిమలాడినా సత్యం ను చూడడానికి లోపలికి పంపించదు. మౌనిక తప్ప అక్కడున్న వాళ్ళందరూ మీనా ను మాటలతో గుచ్చి చంపేస్తారు. మామయ్యను చూడాలని అడిగితే ప్రభావతి కొట్టబోతుంది. రోహిణి ఆపడంతో ప్రభావతి సైలెంట్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మీనాను అంటుంది. మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు బయటికి రాగానే ఏమైందని అందరిని అడుగుతాడు. మీనా వచ్చిన విషయాన్ని మౌనిక చెప్పబోతుంటే ప్రభావతి వద్దని చెప్తుంది. అప్పుడే సీనియర్ డాక్టర్ వస్తే మా నాన్న కండిషన్ ఎలా ఉందో చెప్పండి డాక్టర్ అని అడుగుతాడు. లోపలికి వెళ్ళిన డాక్టర్ సత్యం ను పరీక్షలు చేసి చూస్తుంటాడు. అక్కడితే ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. దానికి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పగానే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నాలుగు లక్షలు తీసుకురావాలని బాలు వెళ్తాడు. పత్రాలు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదని మీనాకు ఫోన్ చేయాలని అనుకుంటాడు. మీనా తన మామయ్యకు బాగుండాలని గుడిలో పొర్లుదండాలు పెడుతూ ఉంటుంది.. రేపటి ఎపిసోడ్ లో మీనా బాలు కలిసిపోతారా? అనేది చూడాలి..