EPAPER

Suriya : సత్యం సుందరం సినిమాకి నాకు 25% ప్రాఫిట్స్ వచ్చాయి

Suriya : సత్యం సుందరం సినిమాకి నాకు 25% ప్రాఫిట్స్ వచ్చాయి

Hero Suriya : ఏమీ లేని సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్‌ను వసూలు చేస్తాయి. ఇంకొన్నిసార్లు సినిమా చాలా బాగున్నా కూడా అద్భుతమైన టాక్ బయటకు వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రాకుండా పోతాయి. కొన్ని సినిమాలు కేవలం ప్రశంసలకు మాత్రమే పరిమితం అయిపోతాయి. రీసెంట్ టైమ్స్ లో సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సత్యం సుందరం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఈ సినిమాకి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది రివ్యూ రైటర్స్ కూడా ‘ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి’ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగులో ఈ సినిమాకి ప్రేక్షకులు విపరీతంగా బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చూసినంతసేపు ఒక మంచి సినిమా చూసాం అని ఫీల్ ప్రేక్షకుడికి కూడా కలిగింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ప్రమోట్ కూడా చేశారు. ఇంత మంచి సినిమాను తమిళ్ ప్రేక్షకులు ఎందుకు నార్మల్ గా వదిలేశారు అంటూ చాలామంది తెలుగు ఆడియన్స్ కామెంట్స్ కూడా చేశారు.

Also Read : డాకు మహారాజు ను పక్కన పెట్టి ఈ టైటిల్ పై కన్నేసిన టీం… ఆల్మోస్ట్ ఫిక్స్ ?


96 సినిమా తర్వాత సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా “మెయిజగన్”. ఈ సినిమాని తెలుగులో సత్యం సుందరం పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి తమిళంలో సరైన ఆదరణ దక్కలేదు అని కొద్ది మేరకు విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. కొంతమంది ఈ సినిమా గురించి చెప్పారు కానీ రావాల్సిన అంత గుర్తింపు ఈ సినిమాకు రాలేదు అనే వెలితి మాత్రం ఉంది. అయితే ఇదే విషయంపై రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు సూర్య. సత్యం సుందరం సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించింది అని సూర్య అని అడిగినప్పుడు. ఈ సినిమాకి నాకు 25 శాతం లాభాలు వచ్చాయి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. నేను ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని కూడా ఊహించలేదు. ఒక ప్రొడ్యూసర్ గా నేను ఇటువంటి కథలను విన్నప్పుడు నేను డబ్బులు గురించి ఆలోచించను. ఈ రోజుల్లో హ్యూమన్ వాల్యూస్ గురించి వచ్చే సినిమాలు కష్టం. ఈ తరుణంలో నేను ఇలాంటి సినిమా చేయటం అనేది నాకు పర్సనల్ గా సంతృప్తిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు

Also Read : ఎన్టీఆర్ తో సినిమా చేసిన ఇద్దరు ప్రొడ్యూసర్లు హుస్సేన్ సాగర్ లో దూకార.?

ఒక బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఓటీడీలు వచ్చిన తర్వాత థియేటర్ కి ప్రేక్షకులు రావడం తగ్గిపోయారు అనేది వాస్తవం. ఇక ఓటీటీలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంతా కూడా ఒక రేంజ్ లో ఈ సినిమాకు ఎలివేషన్ ఇస్తున్నారు. కొంతమంది తమిళ్ ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అని ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొన్ని సినిమాలు సరైన టైంలో చూడకపోయినా, కొన్నేళ్లు తర్వాత చూసిన కూడా ఆ ఫీల్ అలానే ఉంటుంది అలాంటి సినిమానే సత్యం సుందరం. ఒక మామూలు కథని వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకుడు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఇటువంటి దర్శకులు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది మన అదృష్టంగా భావించవచ్చు.

Related News

Tollywood’s Richest Director : ఒక్క మూవీతోనే కోట్లు వెనకేసుకున్న యంగ్ డైరెక్టర్..?

Yash : ‘టాక్సిక్ ‘ షూటింగ్ వివాదం పై క్లారిటీ..అదంతా నిజం కాదు?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tabu: షాకింగ్.. 52 ఏళ్ల వయస్సులో ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన నాగార్జున గర్ల్ ఫ్రెండ్.. ?

Rahasya Gorak: అర్ధరాత్రి 2 గంటలకు కూడా అదే పని.. ప్లీజ్.. మా ఆయన కోసం ‘క’ చూడండి

Mokshagna Teja:హీరోయిన్ సెలక్షన్ వెనుక ఇంత కథ జరిగిందా.. బాలయ్య పగడ్బందీ ప్లాన్..!

Photo Talk: మెగా- అక్కినేని వారసులు.. ఒకే ఫ్రేమ్ లో.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే

×