Satyabhama Today Episode October 29th : గత ఎపిసోడ్ లో .. సత్య క్రిష్ కార్లో బయలుదేరుతారు. సత్యకు ఇచ్చిన మాటను క్రిష్ పక్కన పెట్టడం వల్ల సత్య కోపంగా ఉంటుంది. భార్య కోపాన్ని ఎలా తగ్గించాలని క్రిష్ చేసే ప్రయత్నాలు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మాట మర్చిపోవడం మాట ఇచ్చినంత సులువు కాదంటూ షాక్ ఇస్తుంది. ఇక సత్య ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుసుకున్న సత్య వాళ్ళను కలవడానికి వెళ్తారు. డాన్స్ చేస్తున్నప్పుడు సత్యను సంజయ్ ఫోటో తీస్తాడు. అందరి ముందే సత్య సంజయ్ ని తిడుతుంది . ఇక ఆ తర్వాత మళ్లీ సత్య చేస్తున్న ప్రయత్నాలను సత్య తిప్పి కొడుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని హర్ష సంతోషంగా ఉండడం చూసి మైత్రి ఓర్వలేక పోతుంది . ఎలాగైనా వీరు సంతోషాన్ని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర చూస్తూ కాల్ జారీ లోపల పడిపోతుంది. హర్ష మైత్రిని పైకి తీసుకొస్తాడు. ఇక ఎంత లేపిన లేవకపోవడంతో పక్కనున్న వాళ్లు పొట్ట మీద నొక్కని లేదా సిపిఆర్ చేయాలని చెబుతారు. ఇక హర్ష నాకు ఊపిరి ఇవ్వబోతున్నాడని సంతోషంగా ఫీల్ అవుతుంది మైత్రి.. హర్ష తాకపోతుంటే నందిని ఆగు అని చెప్పేసి తానే సిపిఆర్ చేస్తుంది. దాంతో మైత్రి లేస్తుంది. స్విమ్మింగ్ రానప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు అసలు అని చెప్పేసి నందిని మైత్రి పై అరుస్తుంది. ఇక అక్కడి నుంచి సత్య వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతారు. డాన్స్ చేసిన తర్వాత సత్య బయటకు వస్తుంది .సత్యను సంజయ్ అడ్డుకుంటాడు. మొదట నీకు క్రిష్ అంటే ఇష్టం లేదు కదా ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నావ్ అలానే నా మీద కూడా నీకు ఇష్టం పెరుగుతుంది ఈ రిలేషన్ మనిద్దరం సీక్రెట్ గా మెయింటైన్ చేద్దాం నా జన్మ ధన్యమైపోతుంది అంటూ సంజయ్ భారీ డైలాగులు సత్య దగ్గర కొడతాడు. దానికి సత్య సంజయ్ చెంప పగలగొడుతుంది.
చక్రవర్తి మామయ్యా అంటే నాకు చాలా ఇష్టం ఆయన మంచితనం కొంచెం కూడా నీకు లేదు ఆయన లాంటి సంస్కారం నీకు అస్సలు లేదు నువ్వు నిజంగా ఆయన కొడుకు వెంటే నాకు అసలు నమ్మాలినే లేదు అనేసి సత్య సంజయ్ కు క్లాసు పీకుతుంది. నువ్వు చిన్నప్పుడు నుంచి ఫారిన్ లో పెరిగావు కానీ ఇది ఇండియా ఇండియాలో అమ్మాయిలకు ఒక క్యారెక్టర్ ఉంటుంది నాకు ఒక క్యారెక్టర్ ఉంది అది గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలా చేస్తే నేను నిజంగానే క్రిష్ కి చెప్పి నీ అంతు చూసేలా చేస్తాను అనేసి అంటుంది. సంజయ్ నువ్వు ఎన్నన్నా నిన్ను దక్కించుకునే అంతవరకు నేను వదలను అనేసి అంటాడు.
ఇక నందిని కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళు నందినిని ఏడిపిస్తుంటారు.. ఇక నందిని హర్షా అని హర్ష అని పిలుస్తుంది. హర్ష వాళ్ళతో గొడవ పడతాడు. హర్ష వాళ్ళని కొడుతుంటే నందిని కృష్ణ పిలుస్తుంది. క్రిష్ రాగానే నందిని హర్షని తీసుకొని బయటకు వస్తుంది. ఇక క్రిష్ మాత్రం నా చెల్లెలు ఏడిపిస్తారా అని వాళ్ళని చితక్కొడతారు.. అది చూసిన సత్య వాళ్ళని చంపేస్తావా ఏంటి అనేసి బయటకు తీసుకొని వస్తుంది. సత్య ఎదురుగా సంజయ్ వస్తాడు. ఎవరో ఒక మాట అంటేనే ఎంత రియాక్ట్ అయ్యాడో క్రిష్ చూశావుగా.. ఏడిపిస్తున్నారని తెలిస్తే ఊరుకుంటాడా ఇది ఆలోచించు అనేసి వార్నింగ్ ఇస్తుంది.
ఇక సత్య ఎలాగైనా లోబర్చుకోవాలని సంజయ్ ఆలోచిస్తూ ఉంటాడు. సంధిని అడ్డుపెట్టుకొని సత్యను లోబర్చుకోవాలని అనుకుంటాడు.. ఏమైంది సంధ్య అంటే నాకు ఈ జెయింట్ వీల్ ఎక్కాలి అనిపిస్తుంది కానీ కొంచెం భయమేస్తుంది అనేసి అంటుంది. భయం ఎందుకు నేనున్నా పదాన్ని లైన్లో పెట్టే పనిలో ఉంటాడు హర్ష. ఇక నందిని హర్షతో మాట్లాడుతుంటుంది. దెబ్బలు గట్టిగా తగిలాయని అడుగుతుంది. నేను పెద్ద రౌడీని కాదు కానీ నా భార్య జోలికి వస్తే ఎవరిని వదలను అనేసి అనగానే నందిని తన ప్రేమను చూసి పొంగిపోతుంది. ఇంత ప్రేమ ఉందని సంతోష పడిపోతుంది. ఇంత పక్క నుంచి చూస్తున్న మైత్రి మొదట ఈ ప్రేమ నామీద ఉంది ఇప్పుడు నీ మీదకొచ్చింది ఇకముందు అది నాకే సొంతం మనసులో అనుకుంటుంది. ఇక అందరూ బయలుదేరి పోవాలని అనుకుంటారు. కనిపించకపోతే క్రిష్ అడుగుతాడు. సత్యానందిని మాకేం తెలుసు ఎవరైనా దోస్త్ వచ్చి ఉంటే పోయారేమో అని చెప్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
రేపటి ఎపిసోడ్ లో మహదేవయ్యకు గాయమై ఉంటుంది. అది చూసిన క్రిష్ విలవిలలాడిపోతాడు. అంత నాదే తప్పు నావల్ల ఇలా జరిగింది అనేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్. సత్యా దగ్గరికి మహదేవయ్య వచ్చి ఇదంతా నాటకం అని చెప్తాడు సత్యా షాక్ అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మహదేవయ్య నాటకాన్ని సత్య బయటపెడుతుందేమో చూడాలి..