Hero Darshan : కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వరుస హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంత పెద్ద స్టార్డం ఉన్న హీరో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన అభిమాని హత్య కేసులో ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మర్డర్ కేసులో దర్శన్ ఉండటం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇండస్ట్రీ వేరైనా కూడా తన అభిమాని హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చెయ్యడం పెను సంచలంగా మారింది.. అయితే దర్శన్ కు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.. ఈ సమస్య వల్ల ఆయన బెయిల్ కు అప్లై చేసాడు. దానిపై ఈరోజే తీర్పు వెలువడనుంది.
దర్శన్ అభిమాని రేణుకాస్వామి(Renukaswamy) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా బళ్లారి జైల్లో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్ కు మంగళవారం రాత్రి విమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.. దర్శన్ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ కు విమ్స్‌లో స్కానింగ్ పరీక్షలు చేశారు. ఉదయం వేళ ఆసుపత్రికి తీసుకెళ్లితే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాత్రి తీసుకెళ్లారు. ఇంతకు మునుపే వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచించారు. గత కొంత కాలంగా నొప్పి మరింత ఎక్కువ కావడంతో ఆయనకు మంగళవారం రాత్రి పరీక్షలు చేశారు.
అన్ని పరీక్షలు చేసిన అనంతరం ఆపరేషన్ అవసరముందని డాక్టర్లు తెలిపారు.. ఈయన తరపున లాయర్లు కోర్టుకు నోటీసులు అందించారు. అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.. తదుపరి విచారనను ఈరోజుకు వాయిదా వేశారు.. ప్రస్తుతం దర్శన్ కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే దర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు.. 100 రోజులు దాటింది. ఇక ఈ కేసు రోజుకో ట్విస్ట్ లతో జనాలకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ జరుగుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈయన జైలు నుంచి బయటకు రావడం కష్టమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇప్పుడు సర్జరీ చెయ్యాలి కాబట్టి బెయిల్ పిటిషన్ పై జడ్జి ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.. మరి ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఆపరేషన్ తర్వాత ఆయన మళ్లీ జైలుకు వస్తారా? లేదా సినిమాలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.