Kadambari Jethwani Case :
⦿ జత్వానీ కేసులో విద్యాసాగర్ కు ఎదురు దెబ్బ
⦿ ఉత్తర్వులపై సవాల్ చేసిన విద్యాసాగర్
⦿ పోలీసులు మార్గదర్శకాలు పాటించలేదు
⦿ అరెస్టుకు కారణాలు వివరించలేదు
⦿ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యాసాగర్
⦿ సోమవారం విచారణకు వచ్చిన పిటిషన్
⦿ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, స్వేచ్ఛ : ముంబాయి నటి జత్వానీ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత
నటి జెత్వానీ ఇచ్చిన పిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను గతంలో హైకోర్టులో విద్యాసాగర్ సవాల్ చేశారు. విద్యాసాగర్ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కుక్కల విద్యాసాగర్ అరెస్టు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
కోర్టులో విచారణ
కాగా.. తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై గతవారం హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్ అరెస్టు విషయంలో చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని, అరెస్టుకు కారణాలను ఆయనకు వివరించలేదని.. బంధువులకు తెలియజేయలేదని తెలిపారు. అరెస్టుకు కారణాలను రిమాండ్‌కు ముందు ఆయనకు అందజేశారని వాటిని కొట్టివేయాలని కోరారు.
నిబంధనల ప్రకారమే..
కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ఆర్డర్‌పై పిటిషనర్ సంతకం కూడా చేశారని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించి వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం .. విద్యాసాగర్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
ALSO READ : జనసేన లోకి విడదల రజినీ? బాలినేనితో రాయబారం నిజమేనా? జగన్ కు షాక్ తగిలేనా?