Kiran Abbavaram KA movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి ఆ తరువాత రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రవి కిరణ్ కోలా దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఒక మామూలు కథను మనసుకు హత్తుకునేలా డిజైన్ చేశాడు రవికిరణ్. అలానే చాలా సహజంగా నటించి మంచి మార్కులు పొందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో 90 స్ కిడ్స్ ఏవైతే అప్పట్లో ఎక్స్పీరియన్స్ చేశారు. వాటన్నిటినీ కూడా ఈ సినిమాలో పొందుపరిచి ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అందుకని ఈ సినిమా ఇప్పుడు చూసిన కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది.
ఈ సినిమా తర్వాత కిరణ్ హీరోగా నటించిన సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం. కేవలం హీరోగానే కాకుండా తనలో ఉన్న రచయితను కూడా ఈ సినిమాతో బయటకు తీశాడు కిరణ్. కరోనా వేవ్ కొంతమేరకు తగ్గిన తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన హిట్ అయింది. మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కేవలం హీరో గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలోని సాంగ్స్ డైలాగ్స్ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కిరణ్ కు విపరీతంగా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సినిమాలు చేశాడు కిరణ్.
అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు కానీ సరైన కథలను ఎన్నుకోలేకపోయాడు అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సరైన హిట్ సినిమా కిరణ్ కెరియర్ లో పడలేదు. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కిరణ్ నటించిన సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటి ఫలితాలు విపరీతంగా తేడా కొట్టాయి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కిరణ్ ఒక ఫోటో పెట్టినా కూడా హీరోలా ఉన్నావ్ అన్న అంటూ కామెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే వీటి గురించి ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా కిరణ్ ను అడిగారు. దీనికి చాలా అద్భుతంగా కిరణ్ సమాధానం చెప్పాడు.
వరుసగా ఎక్కువ ఒక మనిషి కనిపిస్తున్నప్పుడు, అలానే ఆడియన్స్ కి నచ్చని కంటెంట్ ఇస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరికైనా కూడా బోర్ కొడతాం. అలానే చాలామంది సినిమా జర్నలిస్టులు కూడా నా గురించి ఏదైనా రివ్యూ రాస్తే అది చదివి వాటి నుంచి నేర్చుకుని నన్ను నేను కొత్తగా మలుచుకుంటాను. నేను వరుసగా అటువంటి సినిమాలు చేయడం వలనే నా మీద నెగెటివిటీ వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్న క అనే సినిమా హిట్ అవుతుంది. మళ్లీ అందరూ నన్ను పాజిటివ్ గా చూడటం మొదలుపెడతారు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా గాని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ను కరెక్ట్ గా అర్థం చేసుకొని ఆన్సర్ చేశాడు. కెరియర్ కూడా అంతే అర్థం చేసుకొని అర్థవంతమైన కథలను ఎన్నుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు.