EPAPER

PAC Meeting : పీఏసీ సమావేశంలో రసాభాస.. అరెకపూడి గాంధీని నిల‌దీసిన బీఆర్ఎస్

PAC Meeting : పీఏసీ సమావేశంలో రసాభాస.. అరెకపూడి గాంధీని నిల‌దీసిన బీఆర్ఎస్

PAC Meeting :


⦿ మీరు ఏ లెక్కన పీఏసీ ఛైర్మన్?
⦿ మీటింగ్‌లో గాంధీని నిల‌దీసిన బీఆర్ఎస్
⦿ నిర‌స‌న వ్యక్తం చేసి వాకౌట్
⦿ రేవంత్ పాల‌న‌లో బుల్డోజ్ రాజ‌కీయం
⦿ చిల్లర రాజకీయం చేశారని కాంగ్రెస్ మండిపాటు

హైదరాబాద్‌, స్వేచ్ఛ: తెలంగాణ‌ అసెంబ్లీలో సోమవారం జరిగిన పీఏసీ సమావేశం రసాభాసగా మారింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ స‌భ్యులు పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా పీఏసీ స‌భ్యులైన వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ సమావేశంలో తమ నిరసనను తెలిపి, మధ్యలోనే సమావేశాన్ని బహిష్కరించారు.


గాంధీ విపక్షమా?
అనంత‌రం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పీఏసీ చైర్మన్‌ పదవి విపక్షానికి ఇవ్వటం సంప్రదాయమని, ఈ మేరకే గతంలో విప‌క్ష టీడీపీకి చెందిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎనమల రామకృష్ణుడు పీఏసీ చైర్మన్లుగా పనిచేశారన్నారు. లోక్‌సభలోనూ ఇదే సంప్రదాయమే కొనసాగుతోందని గుర్తుచేశారు. నేటి సమావేశంలో తాము ఇదే మాట అడిగితే, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడేనంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్పటం వింతగా ఉందన్నారు. ఫిరాయింపుదారులతో సీఎం సమావేశం కావటంపై శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని, ఆస్తులు కాపాడుకోవడానికే వారంతా తమ పార్టీలోకి వస్తున్నారన్న మధుయాష్కి గౌడ్‌ మాటలను ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

అంతా బుడ్డోజ్ చేయటమే..
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బుల్డోజర్ రాజకీయమే నడుస్తోందని సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. గాంధీని కాంగ్రెస్‌ సభుడిగా సీఎం బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. చేరికల విషయంలో కాంగ్రెస్‌ దాగుడు మూతలు ఆడుతోందని, గాంధీని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మండలి సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందనీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం మనసు మార్చుకుని, కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ ఛైర్మన్‌గా నియమించాలని ఆమె కోరారు.

వారిదంతా చిల్లర రాజకీయం –  చిక్కుడు వంశీకృష్ణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే
‘నేటి రెండవ పీఏసీ సమావేశంలో కమిటీ సభ్యులతో బాటు సిఎస్ శాంతి కుమారి, కాగ్ అకౌంటెంట్ జనరల్ మాధవి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోవటం వింతగా ఉంది. అరికెపూడి గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హోదాలో, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొనే చోటనే నేటి సమావేశంలో కూర్చొన్నారు. ఆయనను పీఏసీ ఛైర్మన్‌గా నియమించినట్లు తొలి పీఏసీ సమావేశంలోనే అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు వివరణ కూడా ఇచ్చారు. గత పదేళ్లుగా పీఏసీ సమావేశాలు సక్రమంగా జరగలేదు. దీంతో పలు ఆర్థిక అంశాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. అందుకే త్వరలో మూడో పీఏసీ సమావేశం నిర్వహించి, బడ్జెట్‌ గురించి సమగ్రంగా చర్చిస్తాం. కనీసం ఆ మూడో మీటింగ్‌కైనా బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారని ఆశిస్తున్నాం’

 

Related News

Formula E Racing Scam: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!

Rahul Gandhi Tour: నవంబర్ ఐదు.. తెలంగాణకు రాహుల్‌గాంధీ

Salvo industries : అనామక కంపెనీకి బడా టెండర్.. కథంతా నడిపించిన ఆ లీడర్

Congress : మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రె’ఢీ’

Janwada Farm House : సరే ఏం జరగలేదు.. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమా? – బీఆర్ఎస్ కు ఎంపీ అనిల్ కుమార్ సవాల్

CM Revanth Reddy: గృహ ప్రవేశాలు ఇలా కూడా చేస్తారా? తప్పేలేకుంటే ఎందుకు పారిపోయారు? కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు తీపికబురు.. ఆ పథకం జనవరి నుండే ప్రారంభం.. ఇక వారికి పండగే!

×