ANR National Awards : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర నటులలో ఎన్టీఆర్,ఏఎన్నార్ ఒకరు. ఏఎన్నార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఏఎన్నార్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో గ్రేట్ లవ్ స్టోరీలు ఏఎన్నార్ కెరియర్ లో ఉన్నాయి. మూగమనసులు వంటి ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ కూడా ఏఎన్నార్ కెరియర్ లో ఉన్నాయి. మూగమనసులు లాంటి ఒక కథను ఒప్పుకోవడమే రిస్క్ పాయింట్. అలాంటిది ఆ సినిమాను ఒప్పుకొని సక్సెస్ కొట్టడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ మూగమనసులు సినిమా చూసిన ప్రతిసారి ఆ రోజుల్లో ఇంత గొప్ప సినిమాను ఎలా తీశారు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. పునర్జన్మ కాన్సెప్ట్ ను అంత బాగా అర్థమయ్యేటట్లు డిజైన్ చేశారు. రీసెంట్గా వచ్చిన శ్యాం సింగ రాయ్ సినిమా కూడా మూగమనసులు సినిమాని కొంతమేరకు పోలి ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్యాం సింగ రాయ్ సినిమా క్లైమాక్స్ ని చూసినట్లయితే ఖచ్చితంగా మూగమనసులు సినిమా క్లైమాక్స్ గుర్తొస్తుంది.
Ram Charan: అక్కినేని ఈవెంట్.. గ్లోబల్ స్టారే హైలైట్.. ఏం లుక్ రా బాబు.. మెంటల్ ఎక్కించేశాడు
ఇలా ఒకటి రెండు కాదు ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో సంఖ్యలో సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పటి సినిమాల్లో ఏఎన్నార్ డాన్స్ చాలా ప్రత్యేకంగా ఉండేది. అప్పటి ప్రేక్షకులకు మోస్ట్ ఎంటర్టైనింగ్ గా అనిపించేది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్ లో మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… “నేను డాన్సులు వేయడానికి ఆద్యున్ని. ఈ ఫిలిమ్ ఇండస్ట్రీలో డాన్సుల్ని పరిచయం చేసింది నేనే. నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డాన్సులకి స్పీడ్ పెంచింది గ్రేస్ పెంచింది మెగాస్టార్ చిరంజీవి అని ఏఎన్నార్ అనేవారు. చిరంజీవి హీరోయిన్ తో డాన్స్ వేస్తుంటే నేను చిరంజీవినే చూస్తాను. ఆ హీరోయిన్ ని చూడను. అలా ఆకట్టుకుంటాడు తన డాన్సులతో. అని ఆయన అంటుంటే ఆ మాటలను నేను వింటుంటే, నాకు అవి చాలదా అనిపించేది ఆ మాటలే నాకు ఎన్నో అవార్డులతో సమానం అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.”
ANR National Award 2024: ఏఎన్ఆర్ చివరి మాటలు వింటే కన్నీళ్లాగవ్..!
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే మెగాస్టార్ గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పైర్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. మెగాస్టార్ డాన్స్ చూడటం అనేది ఒక విజువల్ ట్రీట్. చాలామంది తెలుగు ఆడియన్స్ మెగాస్టార్ చిరంజీవి డాన్సులు చూడడం కోసమే థియేటర్లకు పరుగులు పెడతారు అని చెప్పొచ్చు. మెగాస్టార్ డాన్స్ పర్ఫామెన్స్ గురించి ఏఎన్నార్ లాంటి హీరోనే ఒప్పుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోస్లో అఖిల్ అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఇది మొదటి సినిమా అఖిల్ తోనే ప్రూవ్ అయింది. కాకపోతే అఖిల్ కు ప్రాపర్ హిట్ సినిమా ఇప్పటివరకు పడలేదు. అఖిల్ లో మాత్రం విపరీతమైన టాలెంట్ ఉంది అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.